Most Followed World Leader Modi: ‘ఎక్స్’లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన నేతగా ప్రధాని మోదీ.. ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు

ప్రముఖ సామాజిక వేదిక ఎక్స్‌ (గతంలో ట్విట్టర్) లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ప్రపంచ నేతగా భారత ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు.

Musk-Modi

Newdelhi, July 20: ప్రముఖ సామాజిక వేదిక ఎక్స్‌ (X) (గతంలో ట్విట్టర్) లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ప్రపంచ నేతగా భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) రికార్డు సృష్టించారు. ఈ నేపథ్యంలో ఆయనకు  ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు తెలిపారు. ‘అత్యధిక ఫాలోవర్లతో ఉన్న ప్రధాని మోదీకి కంగ్రాట్స్’ అని ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. జులై 14న ఎక్స్‌ ‌లో మోదీ ఫాలోవర్ల సంఖ్య 100 మిలియన్లు దాటిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా తాన ఫాలోవర్లతో పంచుకున్నారు. గ్లోబల్ సెలబ్రిటీలైన టేలర్ స్విఫ్ట్ (95.3 మిలియన్ ఫాలోవర్లు), లేడీ గాగా (83.1 మిలియన్లు), కిమ్ కర్డేషియన్ (75.2 మిలియన్లు) లను సైతం మోదీ మించిపోవడం విశేషం.

ఏపీలో టీడీపీ దాడుల‌పై వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం, ఢిల్లీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో క‌లిసి ధర్నా

ఎవరూ సాటిరారు

ఎక్స్ లో ఫాలోవర్ల సంఖ్యను బట్టి చూస్తే ప్రపంచరాజకీయ నేతలు కూడా మోదీ దరిదాపుల్లో లేరు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ కు 38.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా దుబాయ్ పాలకుడు షేక్ ముహమ్మద్‌ కు 11.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. క్రికెట్ ప్రపంచ స్టార్ విరాట్ కోహ్లీ (64.1 మిలియన్ ఫాలోవర్లు), ఫుట్‌ బాల్ స్టార్ నేమార్ జూనియర్ (63.6 మిలియన్), బాస్కెట్ బాల్ ప్లేయర్ లిబ్రాన్ జేమ్స్ (52.9 మిలియన్లు) కూడా మోదీ తర్వాతే ఉన్నారు.