Fake Railway TTE: డబ్బుల సంపాదనకు అడ్డదారి.. రైళ్లలో నకిలీ టీటీఈ అవతారమెత్తిన మహిళ.. రెడ్ హ్యాండెడ్‌ గా ఎలా దొరికిందంటే?? (వీడియోతో)

రైలు ప్రయాణికుల నుంచి ఈజీగా మనీ కొల్లగొట్టాలని ఓ కిలాడీ లేడీ నకిలీ టీటీఈ అవతారమెత్తింది.

Fake Railway TTE (Credits: X)

Newdelhi, Aug 26: ఈజీగా మనీ (Easy Money) సంపాదించాలని కొందరు అడ్డదారులు తొక్కి అంతే ఈజీగా పట్టుబడుతూ ఉంటారు. రైలు ప్రయాణికుల (Railway Passengers) నుంచి ఈజీగా మనీ కొల్లగొట్టాలని ఓ కిలాడీ లేడీ నకిలీ టీటీఈ (Fake TTE) అవతారమెత్తింది. ఎవరికీ అనుమానం రాకుండా గులాబీ రంగు కోట్ వేసుకుని.. టీటీఈలాగా నటించింది. అయితే ఆ యువతి చేస్తున్న చేష్టలతో కొందరు ప్రయాణికులకు అనుమానం వచ్చింది. వెంటనే వారు ఆర్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆమె నిజమైన టీటీఈ కాదని.. నకిలీ టీటీఈ అని తేల్చారు. ఈ ఘటన శుక్రవారం పాతాళకోట్ ఎక్స్‌ ప్రెస్‌ లో చోటు చేసుకుంది.

ఇదేందయ్యా.. ఇది..? హెల్మెట్ పెట్టుకోలేదని కారు డ్రైవర్‌ కు జరిమానానా? నోయిడా పోలీసుల వింత నిర్ణయం

Here's Video

హార్ట్ టచింగ్ వీడియో, 19 ఏళ్ళ తర్వాత భారత్‌లో తండ్రిని కలుసుకున్న జపాన్ కొడుకు, ఒక్కసారిగా హత్తుకుని ఏడ్చేసిన ఇరువురు..

ఎలా దొరికిపోయిందంటే?

రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో టికెట్లు లేని వారిని ఈ కిలాడీ లేడీ టార్గెట్ చేసింది. వాళ్ల  దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం మొదలు పెట్టింది. జరిమానానా? అని ప్రశ్నించిన వారికి అవును అని చెప్పింది. అయితే, రసీదు ఇవ్వమని అడిగితే, పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో ఆమెపై అనుమానం వచ్చిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా, యువతి వసూళ్లకు పాల్పడుతున్న దృశ్యాలను ప్రయాణికులు వీడియో తీసి ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్ గా మారింది.

షాకింగ్ వీడియో ఇదిగో, లైవ్‌లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన ప్రేమికులు, పశ్చిమగోదావరి జిల్లాలో విషాదకర ఘటన



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif