Asia Cup 2022: ఆసియా కప్ ముంగిట.. భారత అభిమానుల్లో 'జెర్సీ' భయం.. అసలెందుకు ఆ భయం?
ఆసియా కప్ లో గెలువలేమేమోనని ఆందోళన.. ఎందుకు?
New Delhi, August 15: క్రికెట్ (Cricket) లో కొన్ని విజయాలు, మరికొన్ని ఓటములు సెంటిమెంట్‌తో ముడిపడి ఉంటాయని నమ్మే అభిమానులు లేకపోలేదు. తాజాగా టీమిండియా అభిమానులకు జెర్సీ (Jersey) భయం పట్టుకుంది. మెగా టోర్నీలకు ముందు మార్చిన జెర్సీలు టీమిండియాకు కలిసి రావడం లేదనదే వారి ఆందోళన. 2016లో టి20 ప్రపంచకప్‌లో ఫైనల్, 2015 ప్రపంచకప్‌లో సెమీఫైనల్ (Semi-Final), 2019 ప్రపంచకప్‌లో సెమీస్‌లోనే భారత్ వెనుదిరిగింది. ఇక 2021 టి20 ప్రపంచకప్(World Cup)లో టీమిండియా దారుణ ప్రదర్శనను కనబరుస్తూ లీగ్ దశలోనే వెనుదిరిగింది. ఈ ఓటములన్నీ టీమిండియా జెర్సీ మార్చినందుకే అని కొందరు అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం భారత జట్టు సౌండ్ వేవ్స్ లేకుండా పాత డార్క్ బ్లూ కలర్ జెర్సీనే వాడుతోంది. ఆసియా కప్ 2022 టోర్నీలోనూ భారత్ ఇదే జెర్సీతో బరిలో దిగనుంది. అయితే ఆసియా కప్ 2022 టోర్నీతో పాటు టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలోనూ కొత్త జెర్సీని తీసుకువచ్చే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు కొన్ని వార్తలు ప్రచారం అయ్యాయి.
దీంతో అభిమానులు ఒకింత ఆందోళన (Tension) వ్యక్తం చేస్తున్నారు. కొత్త జెర్సీ ఆలోచనను విరమించుకోవాలని బీసీసీఐని కోరుతున్నారు. జెర్సీ మారిస్తే మరోసారి భారత జట్టుకి పరాభవం తప్పదేమోనని భయపడుతున్నారు.