Shikhar Dhawan:  ఆ టోర్నీల్లో ఆడితే నాకు అదో ప్రత్యేకమైన అనుభూతి.. వచ్చే ఏడాది వరల్డ్‌ కప్‌లో ఆడడమే నా టార్గెట్‌.. మనసులో మాట బయటపెట్టిన టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్
Shikar Dhawan (Photo Credits: Twitter)

New Delhi, August 14: టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్ (Shikhar Dhawan) ప్రస్తుతం వన్డేలకు మాత్రమే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌ (World Cup)లో ఆడాలనే తన కోరికను ధావన్‌ తాజాగా వ్యక్తం చేశాడు. ఇందుకోసం తన ఫిట్‌నెస్‌, ఆటపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ధావన్‌ తెలిపాడు. ఐసీసీ వంటి మెగా టోర్నీల్లో ఆడితే తనకు అదో ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుందని చెప్పుకొచ్చాడు. కాగా వచ్చే ఏడాది వన్డే వరల్ఢ్‌ కప్‌ భారత్‌ వేదికగా జరగనుంది.

టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్ రాథోర్ కాదు. ఇప్పుడు కోచ్ గా హృషికేష్ కనిత్కకర్.. ఎందుకంటే?

ధావన్‌ ఇటీవల ముగిసిన విండీస్‌తో వన్డే సిరీస్‌లో భారత జట్టుకు కెప్టెన్‌ (Captain)గా వ్యవహరించాడు. అతడి సారథ్యంలోని టీమిండియా మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. అదే విధంగా త్వరలో జింబాబ్వేతో జరగునున్న వన్డే సిరీస్‌కు ధావన్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ధావన్‌ తొలుత కెప్టెన్‌గా ఎంపికైనప్పటికీ.. రాహుల్‌ ఫిట్‌నెస్‌ సాధించడంతో తిరిగి అతడిని సారధిగా బీసీసీఐ నియమించింది.