Killer Wolf: ‘ఆపరేషన్‌ భేడియా’కు మరో సక్సెస్‌.. బోనులో చిక్కిన ఐదో తోడేలు.. ఇంకోటి బయటే..!

ఇంకోటి ఇంకా బయటే ఉంది.

Killer Wolf (Credits: X)

Newdelhi, Sep 10: ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh) లోని బహరాయిచ్‌ (Bahraich) జిల్లా ప్రజలను గడగడలాడిస్తున్న రెండు తోడేళ్లలో (Killer wolfs) ఒకటి ఎట్టకేలకు చిక్కింది. ఇంకోటి ఇంకా బయటే ఉంది. మానవ రక్తం రుచి మరిగి ప్రాణాంతకంగా మారిన ఆరు తోడేళ్లు గ్రామాల్లోకి చొరబడి ప్రజలపై దాడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన యూపీ సర్కార్‌ ‘ఆపరేషన్‌ భేడియా’ చేపట్టింది. ఈ ప్రత్యేక ఆపరేషన్‌ ద్వారా ఇప్పటివరకూ నాలుగు తోడేళ్లను పట్టుకుంది. తాజాగా మరో తోడేలును అటవీ శాఖ అధికారులు బంధించారు. బహరాయిచ్‌ లోని హరబక్ష్‌ పూర్వ గ్రామంలో గల ఘఘర నది సమీపంలో ఐదో తోడేలు అధికారులు ఏర్పాటు చేసిన బోనుకు మంగళవారం చిక్కింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

తెలంగాణకు మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్.. సికింద్రాబాద్ – నాగ్‌ పూర్ మధ్య సేవలు.. 15న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం

Here's Video

ఎంతమంది అసువులుబాసారంటే?

తోడేళ్ళ దాడుల్లో ఇప్పటికే పది మందిదాకా ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మంది గాయాలపాలయ్యారు.

తెలంగాణకు మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్.. సికింద్రాబాద్ – నాగ్‌ పూర్ మధ్య సేవలు.. 15న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం