Team India New Jersey (Photo-BCCI)

శ్రీలంక‌తో నేడు టీమిండియా తొలి టీ20 మ్యాచ్ ఆడ‌నున్న విష‌యం తెలిసిందే. ముంబైలో జ‌ర‌గ‌నున్న ఆ మ్యాచ్ క‌న్నా ముందే.. టీమిండియా ప్లేయ‌ర్లు కొత్త ఫోటోల‌ను రిలీజ్ చేశారు. ప్లేయ‌ర్లు ధ‌రించిన బ్లూ జెర్సీల‌పై కొత్త లోగో ఉంది. చాహ‌ల్ త‌న ఇన్‌స్టాలో పోస్టు చేసిన ఫోటోలో ఆ కొత్త లోగోను గుర్తుప‌ట్ట‌వ‌చ్చు.

అయితే కిట్‌ స్పాన్స‌ర్‌షిప్ మారిన విష‌యంపై మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు బీసీసీఐ ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. బీసీసీఐ కూడా త‌న ట్విట్ట‌ర్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో కిల్ల‌ర్ లోగో ఉన్న జెర్సీల‌ను టీమిండియా ప్లేయ‌ర్లు ధ‌రించారు. కానీ బీసీసీఐ మాత్రం దానిపై వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు.

బీసీసీఐ కీలక నిర్ణయం.. రాహుల్ ద్రావిడ్ స్థానంలో కొత్త కోచ్??

ఇప్పటి వరకు ఎంపీఎల్‌ స్పోర్ట్స్‌ ‘కిట్‌’ స్పాన్సర్‌గా ఉండగా... ఇప్పుడు దాని స్థానంలో కేవల్‌ కిరణ్‌ క్లాతింగ్‌ లిమిటెడ్‌ (కేకేసీఎల్‌) వచ్చింది. ఎంపీఎల్‌తో ఈ ఏడాది మార్చి వరకు బీసీసీఐకి ఒప్పందం ఉన్న విషయం తెలిసిందే. అయితే, తమ హక్కులను మరో సంస్థకు బదలాయించుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎంపీఎల్‌ బోర్డును ఇటీవలే కోరింది.

Here's BCCI Tweet

అందుకే మూడు నెలల స్వల్ప కాలానికి కేకేసీఎల్‌ సీన్‌లోకి వచ్చింది. దాంతో శ్రీలంకతో సిరీస్‌నుంచి కేకేసీఎల్‌ తమ పాపులర్‌ బ్రాండ్‌ ‘కిల్లర్‌ జీన్స్‌’ లోగోను టీమిండియా జెర్సీలపై ప్రదర్శించనుంది.

శ్రీలంకతో టీ20 సిరీస్‌తో హార్దిక్‌ పాండ్యా సారథ్యంలోని యువ జట్టుతో టీమిండియా 2023 ప్రయాణాన్ని ఆరంభించనుంది. ఇందులో భాగంగా ముంబైలోని వాంఖడే వేదికగా ఇరు జట్ల మధ్య మంగళవారం (జనవరి 3)న తొలి టీ20 నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారైంది.