Ganesh Nimajjanam-Khairatabad Ganesh Shobhayatra: కన్నులపండువగా ఖైరతాబాద్‌ మ‌హాగ‌ణ‌ప‌తి శోభాయాత్ర.. లైవ్ వీడియో కోసం క్లిక్ చెయ్యండి..!

నవరాత్రులపాటు ఘ‌నంగా పూజలు అందుకున్న అనంతరం తన తల్లి గంగమ్మ ఒడికి చేరేందుకు ఖైరతాబాద్ గణపయ్య సిద్ధమయ్యాడు.

Khairatabad Ganesh Shobhayatra LIVE (Credits: X)

Hyderabad, Sep 17: 70 అడుగుల ఖైరతాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తి శోభాయాత్ర (Khairatabad Ganesh Shobhayatra) ప్రారంభ‌మైంది. నవరాత్రులపాటు ఘ‌నంగా పూజలు అందుకున్న అనంతరం తన తల్లి గంగమ్మ ఒడికి చేరేందుకు ఖైరతాబాద్ గణపయ్య  సిద్ధమయ్యాడు. వినాయ‌కుడికి క‌మిటీ స‌భ్యులు హార‌తి ఇచ్చి దీన్ని ప్రారంభించారు. భారీ జనసందోహం మధ్య ట్యాంక్‌ బండ్‌ వైపు కదులుతున్నాడు. ఈ సప్తముఖ మహాగణపతిని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. రెండున్నర కిలోమీటర్ల మేర శోభాయాత్ర కొనసాగనుంది.

హైదరాబాద్‌లో నిమజ్జనాలు, రేపు నగరంలో 64 ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్‌, వాహనాల మళ్లింపు రూట్లు ఇవిగో, 25 వేల మంది పోలీసులతో బందోబస్తు

రూట్ ఇదే..

టెలిఫోన్‌ భవన్‌, సెక్రటేరియట్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ మీదుగా మహాగణపతి ట్యాంక్‌బండ్‌ చేరుకుంటాడు. మధ్యాహ్నం ఒకటి, రెండు గంటల లోపు నిమజ్జనం పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

రేపు ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర, ఈ ఏడాది ఖైరతాబాద్ గణపతి హుండీ ఆదాయం ఎంతంటే..