Gold Treasure: 1200 ఏండ్ల నాటి సమాధిలో భారీ బంగారు నిధి.. దాంతో పాటే 32 శవాలు కూడా.. అసలేం జరిగింది??

ఈ సమాధిలో భారీ యెత్తున బంగారు సంపదను గుర్తించారు.

Gold Treasure in Panama (Credits: X)

Newyork, Mar 10: మధ్య అమెరికా దేశమైన పనామాలో (Panama) పురావస్తు శాస్త్రవేత్తలు దాదాపు 1200 ఏండ్ల నాటి ఓ సమాధిని గుర్తించారు. ఈ సమాధిలో భారీ యెత్తున బంగారు సంపదను (Gold Treasure) గుర్తించారు. విలువైన బంగారు దుస్తులతో పాటు బెల్ట్‌ లు, నగలు, తిమింగలం పన్నుతో అలంకరించిన చెవిపోగులు, బ్రాస్‌లెట్లు, గంటలు, సిరామిక్‌ వస్తువులు వంటివి ఇందులో ఉన్నాయి. అయితే, బంగారమే కాదు ఈ సమాధిలో పలు శవాల అవశేషాలు దొరికాయి.

Miss World 2024 Winner Krystyna Pyszkova: మిస్‌ వరల్డ్‌-2024 టైటిల్ గెల్చుకున్న చెక్‌ రిపబ్లిక్‌ భామ క్రిస్టినా..

Egg Cells from Skin Cells: సంతాన లేమితో బాధపడేవారికి శుభవార్త.. చర్మ కణాలతో అండాల సృష్టి.. ఒరెగావ్‌ హెల్త్‌ అండ్‌ సైన్స్‌ విశ్వవిద్యాలయం పరిశోధకుల వెల్లడి

కోక్లే సంస్కృతికి చెందిన ఒక ఉన్నతస్థాయి వర్గానికి చెందిన ప్రభువు సమాధిలో వీటిని గుర్తించారు. అప్పటి పోకడల ప్రకారం.. చనిపోయిన ఉన్నతస్థాయి వ్యక్తితో పాటు వారికి తోడుగా ఉండేందుకు బలిదానం చేసిన దాదాపు 32 మంది శవాల అవశేషాలను కూడా ఆ సమాధిలోనే గుర్తించినట్టు పురావస్తు శాస్త్రవేత్త జులియో మాయో తెలిపారు.