Gujarat: ఆ రెండు దెయ్యాలు చంపేస్తామని బెదిరిస్తున్నాయి, గుజరాత్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసిన వర్సంగ్‌భాయ్‌ బరియా అనే వ్యక్తి, అతని మానసిక పరిస్థితి సరిగా లేదని తెలియడంతో తలపట్టుకున్న పోలీసులు

దెయ్యాల గుంపు తనను వేధిస్తుందని.. వాటి నుంచి తన ప్రాణాలు కాపాడిల్సిందిగా ఆ వ్యక్తి గుజరాత్‌లో పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఫిర్యాదు విన్న పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ghost Representational Image (Photo Credits: Pixabay)

Vadodara, June 30: దెయ్యాలు వేధిస్తున్నాయని వాటిని వెంటనే అరెస్ట్ చేయాలని గుజరాత్ రాష్ట్రంలో ఓ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు అయింది. దెయ్యాల గుంపు తనను వేధిస్తుందని.. వాటి నుంచి తన ప్రాణాలు కాపాడిల్సిందిగా ఆ వ్యక్తి గుజరాత్‌లో పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఫిర్యాదు విన్న పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఘటన వివరాల్లోకెళితే.. గుజరాత్‌ పంచమహల్‌ జిల్లా జంబుఘోడ తాలుగా హమ్లెట్‌ గ్రామానికి చెందిన వర్సంగ్‌భాయ్‌ బరియా(35) అనే వ్యక్తి (Gujarat Man Varsangbhai Bariyaalso) మంగళవారం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఓ దెయ్యాల గుంపు (Gang of Ghosts) తనను వేధిస్తుందని.. ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని తెలిపాడు. మరీ ముఖ్యంగా ఆ గ్రూపులోని రెండు ఆడ దెయ్యాలు (Two Woman ghosts) తనను చంపుతామని బెదిరిస్తున్నాయని వాపోయాడు. ఎలాగైనా తన ప్రాణం కాపాడాల్సిందిగా పోలీసులను అభ్యర్థించాడు.

స్కూళ్లలో ఫీజులు తగ్గించమంటే చావమన్న ఎంపీ విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్‌, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో, చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

బరియా మాటలు, వాలకం చూసిన పోలీసులకు కాస్త తేడా కొట్టింది. దాంతో అతడిని పక్కకు కూర్చోబెట్టి.. కుటుంబ సభ్యులను పిలిచి విచారించారు. ఈ క్రమంలో బరియా మానసిక పరిస్థితి సరిగా లేదని.. గతేడాది నుంచి చికిత్స తీసుకుంటున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. గత పది రోజులగా మందులు తీసుకోవడం మానేశాడని.. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడని పోలీసులకు వెల్లడించారు. ఇక బరియా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. అతడికి వైద్యం అందిచాల్సిందిగా సూచించారు.

ప్రియురాలిపై పగ...ఆమెతో పాటు కుటుంబంలో నలుగురిని గొంతు కోసి 10 అడుగుల గొయ్యిలో పాతిపెట్టిన ప్రియుడు, జేసీబీ ద్వారా అస్థిపంజరాలను బయటకు తీసిన పోలీసులు, మధ్యప్రదేశ్ దేవాస్ జిల్లాలో దారుణ ఘటన

గుజరాత్‌లోని డాంగ్ జిల్లాలో ఇప్పుడు సెల్ఫీలు తీసుకోవడం క్రిమినల్ నేరం

గుజరాత్ యొక్క సుందరమైన డాంగ్ జిల్లా ఇప్పుడు సందర్శకుల కోసం ఏ పర్యాటక ప్రదేశాలలోనైనా సెల్ఫీలు తీసుకోవడం చట్టవిరుద్ధం చేసింది, ఎందుకంటే ఈ చర్యలు ఇప్పుడు నేరంగా పరిగణించబడతాయి. సందర్శకులు ప్రకృతిని ఆస్వాదించేటప్పుడు మరియు ఈ ప్రాంతంలో సెల్ఫీలు తీసుకునేటప్పుడు బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్ల ఈ ప్రాంతంలో సంభవించిన అనేక ప్రమాదాలు, ఘోరమైన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది మళ్లీ జరగకుండా చూసేందుకు ఈ నోటిఫికేషన్ జారీ చేయబడింది.