Bhopal, June 29: స్కూళ్లలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు అడిగితే వారిపై మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి (Madhya Pradesh School Education Minister Inder Singh) నోరు పారేసుకున్నారు. వెళ్లి చావండి, మీకిష్టమైంది చేసుకోండి అంటూ వారిపై విరుచుకుపడ్డారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియో వివరాల్లో కెళితే.. భోపాల్‌లోని స్కూలు పిల్లల తల్లిదండ్రులు మధ్యప్రదేశ్ పాలక్ మహాసంఘ్ అనే బ్యానర్ కింద ఓ యూనియన్‌గా ఏర్పడి, అధిక ఫీజుల విషయమై ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్‌ను కలిసేందుకు అతని నివాసం వద్దకు వెళ్లారు.
కరోనావైరస్ కారణంగా అధిక స్కూల్ ఫీజులు భారంగా మారాయని, వెంటనే వాటిని నియంత్రించాలని వారు మంత్రికి మొరపెట్టుకున్నారు.పేరెంట్స్ అభ్యర్ధనను విన్న మంత్రి.. ‘వెళ్లి చావండి, మీకిష్టమైంది చేసుకోండి’ (Marna hai to maro) అంటూ తిట్టిపోయడంతో అక్కడున్న వారంతా ముక్కున వేలేసుకున్నారు. మంత్రి వ్యాఖ్యలను (MP Minister remarks 'Maro Jao' to parents') అక్కడున్న సభ్యులు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. తలిదండ్రుల బాధను అర్ధం చేసుకోకుండా, నోరు పారేసుకున్న మంత్రిపై నెటిజన్లు నెగిటివ్ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.
Here's Viral Video
The school children's parents and opposition Congress have demanded that such an arrogant minister be sacked from the council of ministers by the CM, if he doesn't quit on his own. @NewIndianXpress @TheMornStandard @gsvasu_TNIE @khogensingh1
— Anuraag Singh (@anuraag_niebpl) June 29, 2021
ఇదిలా ఉంటే కరోనా విపత్కర పరిస్థితుల్లో స్కూళ్లలో అధిక ఫీజులు వసూలు చేయరాదని ఆ రాష్ట్ర హైకోర్టు ఇదివరకే తీర్మానం చేసింది. కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే తీసుకోవాలని విద్యాసంస్థలను ఆదేశించింది. అయితే అత్యున్నత న్యాయస్థానం తీర్పును బేఖాతరు చేస్తూ ప్రైవేటు విద్యాసంస్థలు అధిక ఫీజుల దోపిడికి పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్ధుల తల్లిదండ్రులు సంబంధిత మంత్రికి తమ గోడు వెళ్లబుచ్చుకుందామని వెళ్లారు.
బాధితుల ఫిర్యాదుకు మంత్రి రెస్పాన్స్ చూసి వారంతా షాక్‌కు గురయ్యారు. తమపై నోరుపారేసుకున్న మంత్రి వెంటనే రాజీనామా చేయాలంటూ ఆయన ఇంటి ముందే ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయమై వెంటనే కల్పించుకుని తమకు న్యాయం జరిగేలా చూడటంతో పాటు సంబంధిత మంత్రిని ప్రభుత్వం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పేరెంట్స్ కమిటీ పోరాటానికి ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా మద్దతు తెలపడంతో మంత్రి రాజీనామా విషయమై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. అయితే, ఈ విషయమై మంత్రి స్పందించలేదు.