IPL Auction 2025 Live

Dress Code For Hospital Staff: వైద్య సిబ్బందికి ప్రభుత్వం డ్రెస్ కోడ్.. టీషర్టులు, జీన్స్, స్కర్ట్స్‌ ధరించొద్దని ఆదేశం.. ఎక్కడంటే??

మేకప్ వేసుకుని నగలు ధరించి విధులకు రావొద్దని ఆదేశాలు జారీ చేసింది.

Doctor (Photo File Image)

Newdelhi, Feb 12: సర్కారీ ఆసుపత్రుల్లో (Govt. Hospitals) పనిచేసే వైద్యులు (Doctors), వైద్య సిబ్బందికి (Medical Staff) ప్రభుత్వం ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ (Dress Code) ప్రకటించింది. మేకప్ వేసుకుని, నగలు ధరించి విధులకు రావొద్దని ఆదేశాలు జారీ చేసింది. టీషర్టులు, జీన్స్, స్కర్ట్స్‌ ధరించొద్దని అలాగే, రకరకాల హెయిర్‌స్టైల్స్, పొడవైన గోర్లతో ఆసుపత్రికి రావొద్దని సూచించింది. ఈ డ్రెస్ కోడ్ విషయంలో వైద్య సిబ్బందికి ఎలాంటి మినహాయింపులు ఉండవని, వైద్యులు సహా అందరూ తప్పకుండా పాటించాల్సిందేనని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. డ్రైస్‌కోడ్‌ను ఉల్లంఘించి ఆసుపత్రులకు వస్తే విధులకు వారు గైర్హాజరైనట్టుగానే పరిగణిస్తామని అన్నారు. అయితే, ఇది తెలుగు రాష్ట్రాల్లో కాదండీ.. హర్యానాలో. అక్కడి ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

ఎల్లుండి కొండగట్టుకు కేసీఆర్.. మాస్టర్ ప్లాన్ పై అధికారులతో చర్చ.. నేడు కొండగట్టుకు ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి

వారాంతాలపాటు 24 గంటలూ డ్రెస్ కోడ్ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేశారు. రాత్రి సమయంలో విధుల్లో ఉన్నవాళ్లు కూడా దీనిని అనుసరించాల్సిందేనని తేల్చి చెప్పారు. వృత్తికి ఇది మరింత హుందాతనాన్ని తెస్తుందని అన్నారు.

రైలు ప్రయాణికులకు అలర్ట్.. నేటి నుంచి మార్చి 1 వరకు పలు రైళ్ల రద్దు.. ఏ సర్వీసు రద్దు అయిందో జాబితా ఇదిగో..



సంబంధిత వార్తలు