KCR (Credits: TS CMO)

Hyderabad, Feb 12: కొండగట్టు (Kondagattu) ఆలయ అభివృద్దికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) నడుంకట్టారు. ఇందులో భాగంగా  ఈ నెల 14న కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని ఆయన సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు (Development Works), మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై అధికారులతో చర్చలు జరుపుతారు.

రైలు ప్రయాణికులకు అలర్ట్.. నేటి నుంచి మార్చి 1 వరకు పలు రైళ్ల రద్దు.. ఏ సర్వీసు రద్దు అయిందో జాబితా ఇదిగో..

కాగా, కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి నేడు కొండగట్టు వెళ్లనున్నారు. ఆలయ పరిశీలన అనంతరం ఆలయ పునర్నిర్మాణ ప్రణాళికలను రూపొందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు ప్రకటించి నిధులు కేటాయించింది.