ISRO LVM-3 Rocket: ఇస్రో ఎల్వీఎం-3 రాకెట్ ప్రయోగం విజయవంతం.. వాణిజ్య ప్రయోజనాల కోసం ఎల్వీఎం-3 రాకెట్ కు రూపకల్పన.. 36 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన ఎల్వీఎం-3

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఎల్‌వీఎం-3 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది.

ISRO (Credits: Twitter)

Newdelhi, March 26: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో రాకెట్ (Rocket) ప్రయోగంలో విజయవంతమైంది. తిరుపతి (Tirupati) జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌-SHAR) నుంచి ఎల్‌వీఎం-3 (LVM-3)వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. శనివారం ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ ప్రక్రియ 24.30 గంటల పాటు కొనసాగింది. ఉదయం 9 గంటలకు వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను తీసుకెళ్లిన ఎల్‌వీఎం-3 వాహక నౌక నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీంతో ప్రయోగం విజయవంతమైనట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ ఉపగ్రహాల బరువు 5.8 టన్నులుగా శాస్త్రవేత్తలు తెలిపారు.

Ravi Shastri: సచిన్ 100 సెంచరీల రికార్డును కోహ్లీ అందుకోలేడన్న రవిశాస్త్రి.. ఇంతకీ ఆయన వివరణ ఏమిటంటే??

వన్‌వెబ్‌తో ఒప్పందం

ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ రెండు దశల్లో 72 ఉపగ్రహాలను ప్రయోగించడానికి వన్‌వెబ్‌తో ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా మొదటి 36 ఉపగ్రహాలను గతేడాది అక్టోబరు 23న ఇస్రో విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. తాజాగా రెండో విడత 36 ఉపగ్రహాలను సక్సెస్ ఫుల్ గా పంపింది.