Newdelhi, March 26: అంతర్జాతీయ క్రికెట్లో (Cricket) బ్యాటింగ్ దేవుడు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) 100 సెంచరీలతో ఓ రికార్డును ఇప్పటికే సెట్ చేశారు. అయితే కోహ్లీ (Kohli)... సచిన్ రికార్డు అందుకుంటాడంటూ ఇటీవల కొన్ని కథనాలు వచ్చాయి. దీనిపై టీమిండియా (Team India) మాజీ కోచ్, క్రికెట్ వ్యాఖ్యాత రవిశాస్త్రి (Ravi Shastri) స్పందించారు. కోహ్లీనే కాదు... మరెవరైనా 100 సెంచరీల వరకు వస్తే అది గొప్ప విషయమేనని వ్యాఖ్యానించారు. కోహ్లీలో మరో ఐదారేళ్లు ఆడే సత్తా ఉందని, ఫిట్ నెస్ పరంగానూ తిరుగులేదని, కానీ 100 సెంచరీల రికార్డును అతడు అందుకుంటాడని మాత్రం గట్టిగా చెప్పలేమని అభిప్రాయపడ్డారు.
Ravi Shastri On Virat Kohli Sachin Tendulkars 100 International Centuries Mark | T-10 News https://t.co/24H3ES1DnI
— T-10 World News (@T10WorldNews) March 25, 2023
కాగా, టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ గత కొన్నేళ్లుగా ఫామ్ లేమితో కొట్టుమిట్టాడి, ఇటీవలే మళ్లీ పూర్వపు వైభవాన్ని సంతరించుకున్నాడు. ఇటీవల ఆసీస్ పై సెంచరీ సాధించి టెస్టుల్లో చాన్నాళ్ల తర్వాత శతకాల బాటపట్టాడు. ఓవరాల్ గా అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లీకి ఇది 75వ సెంచరీ.