Worms Rain in China: వామ్మో చైనాలో మరో విచిత్రం, పురుగుల వర్షంతో ఉక్కిరిబిక్కిరైన బీజింగ్, వైరల్‌గా మారిన వీడియో, నిజమా? ఫేకా? అని నెటిజన్ల చర్చ

ఆ దేశ రాజధాని బీజింగ్‌లో పురుగుల వర్షం కురిసింది. నిలిచి ఉన్న పలు కార్లతోపాటు రోడ్డుపై వర్షంతో పాటు పురుగులు (Worms Rain) కూడా పడ్డాయి. దీంతో పురుగులు తమపై పడకుండా ఉండేందుకు కొందరు వ్యక్తులు గొడుగులు వినియోగించారు. ఈ వీడియో క్లిప్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి

Worms Rain in China (PIC @ Screen Garb from viral video)

Beijing, March 11: కరోనా వ్యాప్తికి మూలమైన చైనా మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ దేశ రాజధాని బీజింగ్‌లో పురుగుల వర్షం కురిసింది. నిలిచి ఉన్న పలు కార్లతోపాటు రోడ్డుపై వర్షంతో పాటు పురుగులు (Worms Rain) కూడా పడ్డాయి. దీంతో పురుగులు తమపై పడకుండా ఉండేందుకు కొందరు వ్యక్తులు గొడుగులు వినియోగించారు. ఈ వీడియో క్లిప్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. బీజింగ్‌ (Beijing) రోడ్డుపై నిలిచిన కార్లపై ఆకాశం నుంచి వర్షంతోపాటు పెద్ద సంఖ్యలో పురుగులు పడినట్లు న్యూయార్క్‌ పోస్ట్‌ తెలిపింది. అయితే పురుగుల వర్షానికి కారణం ఏమిటన్నది తెలియలేదని పేర్కొంది. భారీ గాలులకు బురదలోని పురుగులు (worms in China) పైకి కొట్టుకెళ్లి వర్షంతోపాటు ఇలా పడి ఉంటాయని సైంటిఫిక్ జర్నల్ మదర్ నేచర్ నెట్‌వర్క్ తెలిపినట్లు చెప్పింది. తుఫాను తర్వాత వీచే భారీ గాల్లుల్లో పురుగులు, కీటకాలు చిక్కుకున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ఆ జర్నల్‌ పేర్కొన్నట్లు వివరించింది. కాగా, చైనాలో పురుగుల వర్షానికి సంబంధించిన ఒక వీడియో క్లిప్‌ను ఇన్‌సైడర్‌ పేపర్‌ శనివారం ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది.

పురుగులు మీద పడకుండా ఉండేలా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించినట్లు అందులో పేర్కొంది. దీంతో ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Karnataka Bribe: కర్ణాటకలో మరో లంచం ఉదంతం.. డబ్బు డిమాండ్ చేసిన ఆఫీసర్.. డబ్బులు ఇవ్వలేక ఎద్దుని తీసుకోమన్న రైతు.. కలకలం.. ఆ తర్వాత? 

మరోవైపు చైనా జర్నలిస్ట్ షెన్ షివే దీనిని ఖండించారు. పురుగుల వర్షం వీడియో ఫేక్‌ అని తెలిపారు. బీజింగ్ నగరంలో ఇటీవలి కాలంలో ఎలాంటి వర్షాలు కురియలేదని చెప్పారు. ‘నేను బీజింగ్‌లోనే ఉన్నాను. ఈ వీడియో నకిలీది. ఈ వారంలో బీజింగ్‌లో వర్షాలు పడలేదు’ అని ట్వీట్ చేశారు.



సంబంధిత వార్తలు

New Virus In China: నూతన సంవత్సరం వేళ.. చైనాలో మరో కొత్త వైరస్ కలకలం.. కరోనా కల్లోలం ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న సమయంలో ‘హ్యూమన్ మెటానియా’ జూలు.. కిక్కిరిసిపోతున్న చైనా ఆసుపత్రులు (వీడియో)

Redmi Turbo 4 Launched: రెడ్‌మీ నుంచి సూపర్‌ ఫీచర్లతో మొబైల్, చైనా మార్కెట్లోకి వచ్చేసిన రెడ్‌మీ టర్బో 4, ఇంతకీ భారత్‌లోకి వచ్చేది ఎప్పుడంటే?

Andhra Tourist Killed in Goa: గోవాలో ఏపీ యువకుడు దారుణ హత్య, న్యూఇయర్ వేళ తీవ్ర విషాదం, నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Maoist Tarakka Surrendered: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ, కేంద్ర కమిటీ సభ్యుడు వేణుగోపాల్ భార్య తారక్క లొంగుబాటు, మహారాష్ట్ర సీఎం ఎదుట మరో 10 మందితో పాటూ జనజీవనస్రవంతిలోకి మావోయిస్టులు