Bengaluru, March 11: లంచాలకు (Bribe) కర్ణాటక (Karnataka) కేరాఫ్ గా మారుతున్నది. లంచం డిమాండ్ (Demand) చేస్తున్న కేసులు అక్కడ నిత్యకృత్యంగా మారుతున్నాయి. లంచం తీసుకున్న అధికారి పని చేయకుండానే బదిలీ అయ్యాడు. కొత్తగా వచ్చిన అధికారి కూడా లంచం డిమాండ్ చేశాడు. డబ్బు ఇస్తేనే పని జరుగుతుందని తేల్చి చెప్పాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆ రైతు తన వద్ద ఉన్న ఎద్దునే లంచంగా ఇవ్వాలనుకున్నాడు. దానినే కార్యాలయానికి తీసుకెళ్లాడు. దీంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై సొంత జిల్లా హవేరిలో ఈ వింత ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సావనూరుకు చెందిన ఎల్లప్ప రానోజి అనే రైతు మున్సిపల్ రికార్డుల్లో ఇంటి అడ్రస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అప్పటికే అక్కడ ఉన్న ఓ అధికారికి లంచం ఇచ్చాడు. అయితే ఆ రైతు పని పూర్తి కాకుండానే ఆ అధికారి మారారు. కొత్త అధికారి వచ్చాడు. కథ మళ్ళీ మొదటికి వచ్చింది.
Even farmers are not spared by cruel 40% @BJP4Karnataka sarkar. Frustrated farmer wanted to give his cattle as bribe to an officer in @BSBommai's home district.
No wonder Basavaraj Bommai is known as #PayCM. He is a CM only for those who pay him.#BrashtaJanagalaPaksha pic.twitter.com/iaoS4ojY0G
— Siddaramaiah (@siddaramaiah) March 10, 2023
మళ్ళీ తన పని చేయమంటూ మున్సిపల్ ఆఫీసుకు వెళ్ళాడు. రూ. 25,000 లంచం ఇవ్వమని ఆ రైతును ప్రభుత్వ అధికారి డిమాండ్ చేశాడు. డబ్బులు లేక నిస్సహాయుడుగా మారిన ఎల్లప్ప సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన దగ్గర డబ్బులు లేవంటూ.. తన ఎద్దును తీసుకొని మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాడు. ఆ ఎద్దుని ఆఫీసు దగ్గర కట్టేశాడు.దీంతో కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. విషయం కాస్తా ఉన్నతాధికారులకు తెలియడంతో స్పందించారు. లంచం అడిగిన అధికారులకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఎల్లప్ప పనిచేసి పెడతామని హామీ ఇచ్చారు.