Jharkhand: భార్యతో 3 రోజులు, లవర్‌తో 3 రోజులు గడపాలట, మిగతా ఒకరోజు రెస్ట్ తీసుకోవాలట, జార్ఖండ్ రాష్ట్రంలో రాంచీలో విచిత్ర ఒప్పందం కుదిర్చిన పోలీసులు, చివర్లో ట్విస్ట్ ఇచ్చిన ప్రియురాలు
ఓ వ్యక్తిని భార్యతో మూడు రోజులు, ప్రియురాలితో మూడు రొజులు గడపాలని మిగతా ఒక్క సెలవు తీసుకోవాలంటూ చెప్పి (Jharkhand Police Provides Bizarre Solution) పంపించారు.
Ranchi, February 17: జార్ఖండ్ పోలీసులు ఓ వ్యక్తికి విచిత్రమైన సొల్యూషన్ ఇచ్చారు. ఓ వ్యక్తిని భార్యతో మూడు రోజులు, ప్రియురాలితో మూడు రొజులు గడపాలని మిగతా ఒక్క సెలవు తీసుకోవాలంటూ చెప్పి (Jharkhand Police Provides Bizarre Solution) పంపించారు.
ఈ విచిత్ర ఘటన వివరాల్లోకెళితే.. జార్ఖండ్, రాంచీలోని కోక్రతిరోల్ రోడ్ కు చెందిన రాజేష్ మహాతోకు (Rajesh Mahato) పెళ్లైంది. వారిద్దరికీ ఒక బిడ్డ జన్మించింది. అతను ఆ విషయం దాచి పెట్టి మరోక యువతితో ప్రేమాయణం సాగించాడు. తనకింకా పెళ్లి కాలేదని ఆబద్దాలు చెప్పి ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఎక్కడికో తీసుకువెళ్లాడు.
తన భర్త కనిపించకపోయే సరికి రాజేష్ భార్య సదర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మరోక వైపు తమ కుమార్తెను రాజేష్ కిడ్నాప్ చేసి తీసుకువెళ్లాడని ప్రియురాలి తరపు తల్లి తండ్రులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేష్ మహాతో గురించి వెతకటం మొదలెట్టారు.
ఎట్టకేలకు భార్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు గాలించి భర్తను, ప్రియురాలిని పట్టుకున్నారు. అయితే, ప్రియురాలితో పెళ్లి జరిగిందని చెప్పడంతో, భార్య దిగి వచ్చింది. పోలీసుల సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు. మూడు రోజులు భార్య దగ్గర, మరో మూడు రోజులు ప్రియురాలి దగ్గర (3 Days With Wife And 3 With Girlfriend) ఉండాలని పోలీసులు ఒప్పందం చేశారు. ఒక రోజు రెస్ట్ తీసుకునేలా ఒప్పందంలో పేర్కొన్నారు. అంతా ఒకే అనుకున్నాక, ప్రియురాలు ట్విస్ట్ ఇచ్చింది.
తమకు వివాహం జరగలేదని, పెళ్లి పేరుతో మోసం చేశాడని, లైంగికంగా ఇబ్బందులు పెట్టాడని చెప్పి పోలీస్ కేసు పెట్టింది. ప్రియురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని అరెస్ట్ చేసేందుకు భర్త ఇంటికి రాగా అప్పటికే ఆ భర్త ఇంటి నుంచి పారిపోయాడట. భర్త ఇంటి నుంచి పారిపోయేందుకు భార్య సహకరించినట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.