Karnataka Coronavirus: శ్మశానంలో ప్రధాని మోదీ, సీఎం యడ్డీ ఫోటో ఫ్లెక్సీలతో ప్రచారం, ఉచితంగా నీరు, కాఫీ, భోజనం ఏర్పాటు చేశామంటూ బోర్డు, క్లాస్ పీకిన పార్టీ పెద్దలు, వెంటనే ఫ్లెక్సీలు తొలగింపు

ప్రధాని నరేంద్రమోదీ, సీఎం యడియూరప్ప, రెవెన్యూ మంత్రి ఆర్‌ అశోక్, బీడీఏ అధ్యక్షుడు ఎస్‌ఆర్‌ విశ్వనాథ్‌ తదితరుల ఫొటోలతో సోమవారం లోకల్ బీజేపీ నేతలు ఫ్లెక్సీ తయారు చేయించి శ్మశానానికి దారి...అంత్యక్రియలకు వచ్చేవారికి ఉచితంగా నీరు, కాఫీ, భోజనం ఏర్పాటు చేశామంటూ ప్రచారం (get mileage out of tragedy) చేసుకున్నారు.

BJP leaders flex board (Photo-Twitter)

Bengaluru, May 5: కర్ణాటకలో లోకల్ బీజేపీ నేతల (BJP leaders)అత్యుత్సాహం సీనియర్ల చేత చివాట్లు పెట్టించుకునేలా చేసింది. కర్ణాటకలో కోవిడ్‌ మృతుల అంత్యక్రియల కోసం అధికారులు నెలమంగల తాలూకా గిడ్డేనహళ్లి వద్ద ఉచితంగా ఏర్పాట్లు చేశారు.

అయితే ప్రధాని నరేంద్రమోదీ, సీఎం యడియూరప్ప, రెవెన్యూ మంత్రి ఆర్‌ అశోక్, బీడీఏ అధ్యక్షుడు ఎస్‌ఆర్‌ విశ్వనాథ్‌ తదితరుల ఫొటోలతో సోమవారం లోకల్ బీజేపీ నేతలు ఫ్లెక్సీ తయారు చేయించి శ్మశానానికి దారి...అంత్యక్రియలకు వచ్చేవారికి ఉచితంగా నీరు, కాఫీ, భోజనం ఏర్పాటు చేశామంటూ ప్రచారం (get mileage out of tragedy) చేసుకున్నారు.

ఈ విషయం కాస్త పార్టీ పెద్దలకు తెలియడంతో నెలమంగల బీజేపీ నాయకులకు క్లాస్‌ తీసుకున్నారు. దీంతో సాయంత్రం సమయానికి ఫ్లెక్స్‌ తీయించేశారు. బీడీఏ అధ్యక్షుడు ఎస్‌ఆర్‌ విశ్వనాథ్‌ క్షమాపణలు కూడా చెప్పుకొచ్చారు. అయితే అప్పటికే ఈ విషయం నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో జనాలు.. ప్రధాని, సీఎం పరువు తీసేశారంటూ చీవాట్లు పెడుతున్నారు.ఫ్లెక్సీల్లో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సీఎం నవ్వుతూ ఉన్న ఫోటోలు వేయడంతో నెటిజన్లు బీజేపీ నాయకులను తీవ్రంగా విమర్శిస్తున్నారు.

Here's flex board

కాగా కర్ణాటకలోని ప్రభుత్వ ఆస్పత్రిలో 24 మంది రోగులు ఆక్సిజన్ అందక (Oxygen Crisis in Karnataka) మరణించారు. చామరాజనగర్‌ జిల్లా హాస్పిటల్‌లో రోగులు ఆక్సిజన్‌ కొరత, ఇతర కారణాలతో మృత్యువాత ( 24 Patients Dead in Chamarajanagar District Hospital) పడ్డారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సురేష్‌కుమార్‌ తెలిపారు. ఈ మరణాలపై నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు. సంఘటనపై సీఎం యడ్డ్యూరప్ప విచారం వ్యక్తం చేశారు.

ఆక్సిజన్ అందక కర్ణాటకలో 24 మంది మృత్యువాత, విచారం వ్యక్తం చేసిన సీఎం యడ్డ్యూరప్ప, మరణాలపై నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని తెలిపిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి సురేష్‌కుమార్‌

కాగా ఆక్సిజన్‌ అందక మృతి చెందింది 12 మంది మాత్రమేనని, మిగిలిన 12 మంది కరోనా కారణంగా చనిపోయారని చామరాజనగర్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి సురేశ్‌కుమార్‌ తెలిపారు. అదేసమయంలో ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌ భిన్నంగా స్పందించారు. ఆక్సిజన్‌ కొరతతో చనిపోయింది ముగ్గురు మాత్రమేనని తెలిపారు. వేర్వేరు కారణాలతో మిగతా 21 మంది 24 గంటల్లో చనిపోయారని తెలిపారు.