Aravana Prasadam: శబరిమల ఆలయంలో పవిత్ర 'అరవణ ప్రసాదం' విక్రయాల నిలిపివేత.. కేరళ హైకోర్టు ఆదేశం.. యాలకుల్లో పరిమితికి మించి రసాయన పదార్థాలు ఉన్నాయన్న కోర్టు

దీక్షలు విరమించేందుకు శబరిమల వెళ్లిన వారు తిరిగి వస్తూ అక్కడి నుంచి ఈ పవిత్ర అరవణ ప్రసాదం తీసుకువస్తుంటారు. ఈ ప్రసాదం విక్రయాలు నిలిపేయాలని కేరళ హైకోర్టు ఆదేశించింది.

Credits: Twitter

Shabarimala, Jan 13: అయ్యప్ప స్వామి దివ్య క్షేత్రం (Ayyappa Swamy Temple) శబరిమలలో (Shabarimala) ప్రఖ్యాత అరవణ ప్రసాదం (Aravana Prasadam) విక్రయాలు చిక్కుల్లో పడ్డాయి. దీక్షలు విరమించేందుకు శబరిమల వెళ్లిన వారు తిరిగి వస్తూ అక్కడి నుంచి ఈ పవిత్ర అరవణ ప్రసాదం తీసుకువస్తుంటారు. బియ్యం, బెల్లం, నెయ్యి తదితర పదార్థాలు ఉపయోగించి తయారుచేసే ఆ ప్రసాదం విక్రయాలు నిలిపేయాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే..

ప్రముఖ హోమియో వైద్య నిపుణుడు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి కన్నుమూత

అరవణ ప్రసాదంలో ఉపయోగించే యాలకుల్లో పరిమితికి మించి రసాయన పదార్థాలు ఉంటున్నాయన్న నివేదికను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు శబరిమలలో అరవణ ప్రసాదం విక్రయాలు నిలిపివేయాలంటూ ట్రావెన్ కూర్ దేవస్వోమ్ బోర్డును కేరళ హైకోర్టు ఆదేశించింది. అయితే రసాయన పదార్థాలతో కూడిన యాలకులు లేకుండా తయారుచేసిన ప్రసాదం విక్రయించుకోవచ్చని హైకోర్టు వెసులుబాటు కల్పించింది. లేదా, ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోలు చేసిన యాలకులతో తయారుచేసిన ప్రసాదాన్ని విక్రయించుకోవచ్చని ట్రావెన్ కూర్ దేవస్వోం బోర్డుకు స్పష్టం చేసింది.