King Cobra Viral Video: పసి బాలుడిని వెంటాడిన నాగుపాము, తృటిలో తప్పించుకున్న బాలుడు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, వియ‌త్నాంలో ఘటన

అది కాటేస్తే ఇక అంతే సంగతులు. అయితే ఇక్కడ ఓ పిల్లోడిని (King Cobra Follows Child) వెంటాడింది. ఆ చిన్న పిల్లవాడి మీద పగబట్టిందో ఏమో కాని ఆ బాలుడు కోసం కాచుకూర్చుని ఉంది.

King Cobra Tries to Enter Inside House in Vietnam (Photo Credits: YouTube)

New Delhi, July 18: కింగ్ కోబ్రా ఎంత విషపూరితమో అందరికీ తెలుసు. అది కాటేస్తే ఇక అంతే సంగతులు. అయితే ఇక్కడ ఓ పిల్లోడిని (King Cobra Follows Child) వెంటాడింది. ఆ చిన్న పిల్లవాడి మీద పగబట్టిందో ఏమో కాని ఆ బాలుడు కోసం కాచుకూర్చుని ఉంది. వివరాల్లోకెళితే.. వియ‌త్నాంలోని ఓ ఇంటి ఆవ‌ర‌ణ‌లో (House in Vietnam) ఓ పిల్లాడు ఆడుకుంటూ ఉన్నాడు. త‌న తాత కూడా అక్క‌డే నిల్చున్నాడు. తండ్రేమో ఇంటి ద్వారం వ‌ద్ద ఏదో ప‌నిలో నిమ‌గ్న‌మై ఉన్నాడు.

అంత‌లోనే నాగుపాము బుస‌లు కొడుతూ బాలుడి వైపుకు దూసుకొచ్చింది. ఆ పామును చూసిన తాత తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యాడు. పిల్లాడిని తీసుకునేందుకు ప్ర‌య‌త్నం చేశాడు.. కానీ త‌న‌కు ఇటీవ‌లే స్ట్రోక్ రావ‌డంతో అంత‌గా స్పందించ‌లేక‌పోయాడు. ఇక అప్ర‌మ‌త్త‌మైన తండ్రి.. ప‌రుగెత్తి బాలుడిని ఎత్తుకుని ఇంట్లోకి వెళ్లిపోయాడు. నాగుపాము మాత్రం ఆ పిల్లాడి వెంట‌నే ప‌రుగెత్తింది. కింగ్ కోబ్రాను చంపేందుకు తాత క‌ర్ర తీసుకున్న‌ప్ప‌టికీ.. ధైర్యం చేయ‌లేదు. ద్వారం వ‌ద్ద‌కు దూసుకొస్తున్న పామును చూసి తాత కూడా ఇంట్లోకి వెళ్లిపోయాడు. మొత్తానికి గ్లాస్ డోర్‌ను మూసేయ‌డంతో.. పాము ఇంట్లోకి వెళ్ల‌లేక‌పోయింది. కాసేపు అక్క‌డ త‌చ్చాడుతూ.. తిరిగి వెన‌క్కి వెళ్లిపోయింది.

ఈ తతంగమంతా అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఆ త‌ర్వాత ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ (Clip Goes Viral on Social Media) అయింది.



సంబంధిత వార్తలు

Telangana Shocker: పోలీసుల వేధింపులు..పీహెచ్‌డీ విద్యార్థిని ఆత్మహత్య, తండ్రి తీసుకున్న డబ్బులకు తనను వేధించడంపై మనస్తాపం..సూసైడ్, నాచారంలో విషాదం

Amazon Prime Video New Rules: అమెజాన్ ప్రైమ్ వినియోగ‌దారుల‌కు బ్యాడ్ న్యూస్, పాస్ వ‌ర్డ్ షేరింగ్ పై జ‌న‌వ‌రి నుంచి కొత్త‌గా రెండు నిబంధ‌న‌లు తెస్తున్న సంస్థ‌

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Allu Arjun Gets Interim Bail: అల్లు అర్జున్ కేసులో హైకోర్టులో సాగిన వాదనలు ఇవే, మధ్యంతర బెయిల్ విషయంలో అర్నాబ్‌ గోస్వామి కేసును పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం