Kolkata Cop Help: పరీక్ష సమయం మించిపోతుండడంతో సాయం కోసం రోడ్డుపై అర్ధిస్తూ కనిపించిన పదో తరగతి విద్యార్థిని.. గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి అధికారిక వాహనంలో తీసుకెళ్లిన ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్.. ఎక్కడంటే?
అదే సమయంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సౌవిక్ చక్రవర్తి అది చూసి బాలిక వద్దకెళ్లి ఆరా తీశారు… ఆ తర్వాత?
Kolkata, Feb 27: స్కూల్ యూనిఫాంలో (School Uniform) ఉన్న ఓ పదో తరగతి విద్యార్థిని (Tenth Class Student) పశ్చిమ బెంగాల్‌లోని (West Bengal) హౌరా బ్రిడ్జి సమీపంలో ఏడుస్తూ అటువైపు వెళ్తున్న వారిని ఏదో సాయం కోసం అర్థిస్తోంది. అదే సమయంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సౌవిక్ చక్రవర్తి అది చూసి బాలిక వద్దకెళ్లి ఆరా తీశారు. తన తాతయ్య చనిపోయారని, కుటుంబ సభ్యులందరూ అంత్యక్రియలకు వెళ్లారని ఆ బాలిక తెలిపింది. దీంతో పరీక్షకు తీసికెళ్ళే వారు ఎవరూ లేరని, ఎగ్జామ్ టైం అవుతోందని బోరుమంది.
దీంతో కదిలిపోయిన ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్.. బాలికను తన అధికారిక వాహనంలో ఎక్కించుకుని పరీక్ష కేంద్రానికి బయలుదేరారు. పరీక్షకు సమయం దగ్గరపడుతుండడంతో ఆ మార్గంలో గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎలాంటి ఆటంకం లేకుండా నిర్ణీత సమయానికి బాలికను పరీక్ష కేంద్రం వద్ద దింపడంతో బాలిక పరీక్ష రాసింది.
కుమార్తె అత్తింటికి వెళ్ళట్లేదని కన్నతండ్రి ఘాతుకం.. బిడ్డను హత్య చేసి తల, మొండెం వేర్వేరు.. నంద్యాలలో ‘పరువు’ హత్య