Kollam MLA Mukesh: సాయం చేయమన్న విద్యార్థి, ముఖం పగలకొడతానన్న ఎమ్మెల్యే, ఆడియో సంభాషణ వైరల్ కావడంతో ఫేస్ బుక్ వేదికగా క్లిప్‌పై వివరణ ఇచ్చిన మళయాల నటుడు, కొల్లాం ఎమ్మెల్యే ముఖేష్

నీకు నా నంబర్ ఎవరు ఇచ్చారంటూ.. నువ్వు నా ఎదురుగా ఉండుంటే నీ ముఖం పగలకొట్టేవాడిని’’ అంటూ ఎమ్మెల్యే (Kollam MLA Mukesh under fire) ఫైర్ అయ్యాడు.

Kollam MLA and Malayalam actor M Mukesh (Photo-Video Grab)

Kollam. July 5: సాయం చేయమని తన నియోజక వర్గ ఎమ్మెల్యేనే కోరిన ఓ పదవ తరగతి విద్యార్థికి ఎమ్మెల్యే (Kollam MLA Mukesh) నుంచి చేదు అనుభవం ఎదురయింది. నీకు నా నంబర్ ఎవరు ఇచ్చారంటూ.. నువ్వు నా ఎదురుగా ఉండుంటే నీ ముఖం పగలకొట్టేవాడిని’’ అంటూ ఎమ్మెల్యే  (Kollam MLA Mukesh under fire) ఫైర్ అయ్యాడు. ఈ క్లిప్ వైరల్ కావడంతో సదరు ఎమ్మెల్యే ఫేస్ బుక్ వేదికగా వివరణ ఇచ్చారు. ఈ వైరల్ క్లిప్ వివరాల్లోకెళితే..

కేరళ, కొల్లాం సీపీఐ (ఎం) ఎమ్మెల్యే, నటుడు ఎం. ముఖేష్‌కు (Kollam MLA and Malayalam actor M Mukesh) రెండు రోజుల క్రితం ఓ పదవి తరగతి విద్యార్థి కాల్‌ (Class 10 student during phone call) చేశాడు. తన సమస్య గురించి చెప్పి సాయం చేయాల్సిందిగా కోరాడు. ఆగ్రహించిన ఎమ్మెల్యే నా నంబర్‌ నీకు ఎవరిచ్చారని ప్రశ్నించాడు. దానికి ఆ విద్యార్థి స్నేహితుడి వద్ద నుంచి తీసుకున్నానని చెప్పగా.. ఎమ్మెల్యే ఆగ్రహంతో ‘‘నీ స్నేహితుడి ముఖం పగలకొట్టాలి.. ఈ సమయంలో నీవు నా ఎదురుగా ఉంటే.. క్యాన్‌ తీసుకుని నీ ముఖం పగలకొట్టేవాడిని’’ అంటూ దురుసుగా మాట్లాడాడు.

ఆ సాఫ్ట్‌వేర్ హిజ్రా, ఆడగొంతుతో నిరుద్యోగులతో మాటలు కలిపి రూ.15.12 లక్షలు కాజేశాడు, నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టిన అమలాపురం పోలీసులు

అయితే విద్యార్థి సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు.. చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. ఎమ్మెల్యే ప్రవర్తనకు భయపడిన సదరు విద్యార్థి తప్పయ్యింది సార్‌.. క్షమించండి అని కోరాడు. కానీ ముఖేష్‌ విద్యార్థి మాటలు వినకుండా.. అతడిపై మండి పడ్డాడు. ఎమ్మెల్యే-విద్యార్థి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఎమ్మెల్యే ముఖేష్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Here's Kollam MLA Video

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ముఖేష్‌ దీనిపై వివరణ ఇస్తూ.. ఫేస్‌బుక్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి నాకు అవిరామంగా కాల్స్‌ వస్తూనే ఉన్నాయి. గంటలో నా ఫోన్‌ చార్జింగ్‌ అయిపోతుంది. ఎవరేవరో నాకు కాల్‌ చేసి.. మా ఏరియాలో కరెంట్‌ లేదు.. రైళ్లు ఎందుకు సక్రమంగా తిరగడంలేదని.. ఏవేవో ప్రశ్నలు వేస్తూ విసిగిస్తున్నారు.. ప్లాన్‌ ప్రకారం నన్ను ఇబ్బంది పెట్టడానికే ఇలా కాల్‌ చేస్తున్నారు.. కానీ ఇప్పటి వరకు వారికి ఆ అవకాశం లభించలేదు.

షాకింగ్..కొడుకు మాజీ భార్యతో కాపురం పెట్టిన తండ్రి, విషయం తెలిసి అవాక్కయిన కొడుకు, రెండో భర్తతో సంతోషంగా ఉన్నానని తెలిపిన కొడుకు మాజీ భార్య, పోలీసుల దగ్గరకు చేరిన పంచాయితీ, యూపీ బదౌన్‌ జిల్లాలో ఘటన

ఇక ఆ రోజు కూడా నేను జూమ్‌ మీటింగ్‌లో ఉండగా ఓ విద్యార్థి నాకు కాల్‌ చేసి ఇలానే మాట్లాడాడు. జూమ్ మీటింగ్‌లో (Zoom meeting) ఉంటే... ఆ విద్యార్థి నాకు పదే పదే కాల్‌ చేస్తూనే ఉన్నాడు. సమావేశం డిస్టర్బ్‌ అయ్యింది. ఆ కోపం, విసుగులోనే నేను సదరు విద్యార్థిని కోడతాను అన్నాను అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదని ఎమ్మెల్యే ముఖేష్‌ తెలిపారు.