Latest TikTok Craze: రూ.2 వేలు,రూ.500 నోట్లను చిత్తు కాగితాల్లా విసిరేశారు, వీటి ఖరీదు దాదాపు కోటి రూపాయలు, గుజరాత్‌లోని జామ్ నగర్‌లో సంఘటన, పెళ్లి కొడుకు ప్రముఖ పారిశ్రామిక వేత్త, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు
ప్రస్తుతం జీడీపీ రేటు 4.5 శాతంగా ఉంది. అయితే ఇది వ్యాపారస్తులకు పెద్ద సమస్య కానే కాదు. వాళ్లకు దీంతో పట్టింపు లేకుండా డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేస్తుంటారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ గుజరాత్(Gujarat)లోని జామ్ నగర్(Jamnagar)లో జరిగిన ఓ పెళ్లి..
Jamnagar/Gujarath, December 7: భారత ఆర్థిక వ్యవస్థ (Indian economy) ఆరు సంవత్సరాల కనిష్టానికి పడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం జీడీపీ రేటు 4.5 శాతంగా ఉంది. అయితే ఇది వ్యాపారస్తులకు పెద్ద సమస్య కానే కాదు. వాళ్లకు దీంతో పట్టింపు లేకుండా డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేస్తుంటారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ గుజరాత్(Gujarat)లోని జామ్ నగర్(Jamnagar)లో జరిగిన ఓ పెళ్లి..
గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చెందిన జడేజా గ్రూప్ సంస్థ (Jadeja Group in Gujarat) అధినేత రిషిరాజ్ సిన్హా(Rishi Raj Singh)వాణిజ్యవేత్తగా కాకుండా సోషల్ మీడియా (Social Media) ఇన్‌ఫ్యూయెన్సర్‌గానే ఎక్కువ పేరు సంపాదించుకున్నాడు. ఖరీదైన కార్లు, గుర్రపు స్వారీలతో టిక్ టాక్ ద్వారా, ఇతర సోషల్ మీడియా సైట్ల ద్వారా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.
కాగా గతవారం అతడి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి ఊరేగింపులో అతను రూ.2వేల నోట్లు..రూ.500ల నోట్లను చిత్తు కాగితాల్లా విసిరేశారు. దాదాపు కోటి రూపాయల నగదును ఊరేగింపు సమయంలో జనాల మీదకు చిత్తు కాగితాల్లా విసిరేశారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వీరు డబ్బులు విసురుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి.
TIkTok Craze
దీనిపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు టిక్‌టాక్ క్రేజ్‌తోనే ఇలా చేశారని నెటిజన్లు అంటున్నారు. ఏదైమైనా పెద్ద నోట్లను ఇలా గాల్లో విసరడం చూసినవారంతా నోరు వెళ్లబెడుతున్నారు. ఇదే కాదండోయ్.. పెళ్లి కోసం జామ్‌నగర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెల్లా గ్రామంలో భరాత్ చేశారు.
Instagram Tweet
దీని కోసం పెళ్లి కొడుకు..పెళ్లి కూతురు పెళ్లి వేదిక వద్దకు వెళ్లేందుకు రోడ్డుపై కాకుండా గాల్లో వెళ్లారు. కేవలం 20 కిలోమీటర్లు దూరానికి హెలికాప్టర్లో వెళ్లడం విచిత్రంగా అనిపిస్తున్న డబ్బున్న మారాజులకు ఇది మాములే అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అసలే సోషల్ మీడియాలో ఓ చిన్న ఆసక్తికర అంశం దొరికితే చాలు వైరల్ చేసే నెటిజన్లు ఈ వీడియోలను కూడా ఇప్పుడు తెగ వైరల్ చేస్తున్నారు.