Borewell Boy Dies: బోరు బావిలో పడిన ఎనిమిదేండ్ల బాలుడు తన్మయ్ సాహు కథ విషాదాంతం... మూడు రోజులు శ్రమించినా దక్కని ప్రాణాలు (వీడియోతో)
శనివారం బాలుడిని బోరుబావి నుంచి బయటకి తీసినప్పటికీ అప్పటికే అతను మరణించినట్టు అధికారులు తెలిపారు.
Bhopal, Dec 10: ప్రమాదవశాత్తూ బోరుబావిలో (Borewell) పడిన ఎనిమిదేండ్ల బాలుడు తన్మయ్ సాహు (Tanmay Sahu) కథ విషాదాంతమైంది. శనివారం బాలుడిని బోరుబావి నుంచి బయటకి తీసినప్పటికీ అప్పటికే అతను మరణించినట్టు అధికారులు తెలిపారు. అసలేం జరిగింది అంటే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బేతుల్ జిల్లాలోని ఓ గ్రామంలో మంగళవారం రాత్రి ఆడుకుంటున్న తన్మయ్ ప్రమాదవశాత్తూ 55 అడుగుల (55 Feet) లోతున్న బోరుబావిలో పడ్డాడు. ఈ దుర్ఘటన గురించి సమాచారం అందటంతో పోలీసులు, జిల్లా అధికారులు హుటాహుటిన బోరు బావి వద్దకు వచ్చి రెస్క్యూ ఆపరేషన్(Rescue Operation) ప్రారంభించారు.
బాలుడి కదలికలను పర్యవేక్షించేందుకు బోర్‌వెల్‌లో కెమెరాను అమర్చామని తెలిపారు. బోర్‌వెల్,టన్నెల్‌లో ఆక్సిజన్ సరఫరా కోసం ఏర్పాట్లు చేశారు.జిల్లా కలెక్టర్‌తో పాటు ఎస్పీ సీమల ప్రసాద్, ఇతర అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్ర సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్(CM Shivraj Chouhan) పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. అయితే, మూడు రోజులు శ్రమించి బాలుడిని బయటకు తీసినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. దీంతో బాలుడి పేరెంట్స్ కన్నీరుమున్నీరయ్యారు.