UP Horror: క్రైం సీరియల్ చూసి భర్త హత్యకు స్కెచ్..  మితిమీరిన మోతాదులో మందులిచ్చి హతమార్చిన భార్య.. యూపీలో దారుణం
Representational (Credits: Google)

Kanpur, Dec 10: సీరియల్స్ (Serials) ఇంట్లో గృహిణిలపై (Homemakers) ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తాయో నిరూపించే దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని (Uttarpradesh) కాన్పూరులో (Kanpur) జరిగింది. క్రైం సీరియల్ (Crime Serial) ఇచ్చిన ప్రేరణతో మోతాదుకు మించి ఔషధాలు (Medicines) ఇచ్చి భర్తను చంపేసిందో ఇల్లాలు. వివరాల్లోకి వెళ్తే.. కాన్పూరుకి  చెందిన రిషభ్ పై గత నెలలో కొందరు దుండగులు దాడిచేశారు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఈ నెల 1న డిశ్చార్జ్ అయ్యాడు. ఆ తర్వాత రెండు రోజులకే ఆరోగ్యం విషమించి మృతి చెందాడు.

ఈ బాసు సూపరహా.. ఏకంగా 10 వేల ఉద్యోగుల కుటుంబాలను డిస్నీల్యాండ్ ట్రిప్ తీసుకెళ్ళాడు మరి

భార్య సప్నా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. అధిక మోతాదులో ఔషధాలు తీసుకోవడం వల్లే రిషభ్ మరణించినట్టు నిర్ధారించారు. ఔషధాలు అధిక మోతాదులో తీసుకోవడం వల్ల అవయవాలు దెబ్బతిన్నాయని, ఆయన మరణానికి అదే కారణమని తేల్చారు. దీంతో రిషభ్ భార్య సప్నాతోపాటు మరికొందరు అనుమానితుల ఫోన్ కాల్స్, వాట్సాప్ చాటింగులను పరిశీలించడంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. సంక్రాంతి పండుగ ప్రయాణికుల కోసం 4,233 ప్రత్యేక బస్సుల ఏర్పాటు.. జనవరి 7 నుంచి 15 వరకు అందుబాటులోకి

భర్త తన పేరిట ఆస్తి రాయడేమోనన్న అనుమానంతో ప్రియుడు రాజుతో కలిసి సప్నానే ఈ హత్య చేయించినట్టు నిర్ధారణ అయింది. ఓ క్రైం సీరియల్ ఇచ్చిన ప్రేరణతో మోతాదుకు మించి భర్తకు మందులు ఇవ్వడం ద్వారా ఆయన హత్యకు ప్లాన్ చేసినట్టు వెల్లడైంది. విచారణలో సప్నా ఈ విషయాన్ని అంగీకరించింది. దీంతో నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.