Special Buses For Sankranti: టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. సంక్రాంతి పండుగ ప్రయాణికుల కోసం 4,233 ప్రత్యేక బస్సుల ఏర్పాటు.. జనవరి 7 నుంచి 15 వరకు అందుబాటులోకి
సంక్రాంతి పండుగకు వెళ్ళే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. 4,233 ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది.
Hyderabad, Dec 10: పెద్ద పండుగ సంక్రాంతి (Sankranti) కోసం సొంతూళ్ళకు వెళ్ళే వారికి ప్రయాణం ఒక నరకమనే చెప్పాలి. పండుగ రద్దీ వేళ ప్రయాణికులు పడే అవస్థలు, తిప్పలు చెప్పలేం. ఈ క్రమంలోనే పండుగకు వెళ్ళే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ (TSRTC) శుభవార్త (Good News) చెప్పింది. సంక్రాంతి కోసం 4,233 ప్రత్యేక బస్సులు (Special Buses) నడిపేందుకు సిద్ధమైంది. 585 బస్సులకు రిజర్వేషన్ (Reservation) సౌకర్యం కల్పిస్తుండగా, 60 రోజుల ముందుగానే రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. జనవరి 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
ప్రత్యేక బస్సుల్లో 125 అమలాపురానికి, 117 బస్సులు కాకినాడకు, 83 బస్సులు కందుకూరుకు, 65 విశాఖపట్టణానికి, 51 పోలవరానికి, 40 రాజమహేంద్రవరానికి నడుపుతున్నట్టు పేర్కొన్నారు. అలాగే, తెలంగాణలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలకు కూడా ప్రత్యేక బస్సులు నడుస్తాయని ఆయన తెలిపారు.
సంక్రాంతి పర్వదినం సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 4,233 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది జనవరి 7 నుంచి 15వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను నడపనుంది. pic.twitter.com/PeYxaiPCWf
— Managing Director - TSRTC (@tsrtcmdoffice) December 9, 2022
(The above story first appeared on LatestLY on Dec 10, 2022 08:37 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

