Billionaire Treats Employees: ఈ బాసు సూపరహా.. ఏకంగా 10 వేల ఉద్యోగుల కుటుంబాలను డిస్నీల్యాండ్ ట్రిప్ తీసుకెళ్ళాడు మరి
Credits: Instagram

Newyork, Dec 10: ‘ఎక్స్ ట్రా అవర్స్ (Extra Hours) పని (Work) చెయ్, నెల కాగానే జీతం (Salary) తీసుకోవట్లేదు?’ అంటూ ఉద్యోగులను మాటలతో పొడిచే బాస్ (Boss) లు మాత్రమే ఉంటారని అనుకుంటే పొరపాటే. మీరు చదువబోయే ఈ వార్త.. బాస్ లపై మీ అభిప్రాయాన్నే మార్చొచ్చు. సిటాడెల్ ఉద్యోగులు ఇప్పుడు తమ సంస్థ సీఈవో చేసిన పనితో ఎంతో సంబరపడుతున్నారు మరి. ఎందుకంటే  సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో కెన్ గ్రిఫిన్ కంపెనీలో పనిచేసే 10,000 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు డిస్నీల్యాండ్ (Disneyland) లో మూడు రోజుల పర్యటన విడిది ట్రిప్ (Trip) ఉచితంగా ఏర్పాటు చేశారు. ఉద్యోగులు నివసించే ప్రాంతం నుంచి ఫ్లోరిడాలోని డిస్నీల్యాండ్ చేరుకోవడానికి ఫ్లయిట్ టికెట్లను కూడా గ్రిఫిన్ సమకూర్చారు.

టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. సంక్రాంతి పండుగ ప్రయాణికుల కోసం 4,233 ప్రత్యేక బస్సుల ఏర్పాటు.. జనవరి 7 నుంచి 15 వరకు అందుబాటులోకి

అంతేనా, పర్యటన సందర్భంగా భోజనాలు, టిఫిన్లు, ఇతరత్రా రూపాయి కూడా ఖర్చు కాకుండా మొత్తం సిటాడెల్ కంపెనీయే భరించింది. కాగా గ్రిఫిన్ 31.7 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో 40వ అత్యంత సంపన్నుడిగా ఉన్నట్టు ఫోర్బ్స్ జాబితా తెలియజేస్తోంది.