Madhya Pradesh: కోడి పొద్దున్నే కూత కూస్తుందని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వైద్యుడు, ఆ కూత వల్ల నిద్రాభంగం అవుతుందని ఫిర్యాదులో బాధితుడు వెల్లడి

కోడి కూత కూస్తూ (Crowing Of A Chicken) నిద్రకు భంగం కల్గిస్తుందంటూ ఓ వైద్యుడు (Cancer Specialist In Indore) ఏకంగా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు ( complained in police station) చేశారు

Group of chicken (Photo Credits: Pixabay)

Indore, Nov 29: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కోడి కూత కూస్తూ (Crowing Of A Chicken) నిద్రకు భంగం కల్గిస్తుందంటూ ఓ వైద్యుడు (Cancer Specialist In Indore) ఏకంగా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు ( complained in police station) చేశారు. ఈ మేరకు పోలీసులు కోడి యజమానిపై సెక్షన్‌ 138 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అలోక్‌ మోడీ అనే వ్యక్తి పాలసియా ప్రాంతంలోని గ్రేటర్‌ కైలాష్‌ ఆసుపత్రి సమీపంలో గల సిల్వర్‌ ఎన్‌క్లేవ్స్‌లో నివాసం ఉంటాడు.

విదేశాల నుంచి తీసుకువచ్చిన చాక్లెట్ తిని విద్యార్థి మృతి, వరంగల్ జిల్లాలో విషాదకర ఘటన

అతను వృత్తి రీత్యా క్యాన్సర్‌ వైద్యుడు. రోజంతా డ్యూటీలోనే ఉంటాడు, ఆపరేషన్ల కారణంగా అర్ధరాత్రి సమయంలో ఇంటికి వస్తుంటాడు. అప్పుడు నిద్రపోతే ఉదయం వరకు నిద్రలేవడు. అయితే, తన ఇంటి సమీపంలో ఉన్న వందన విజయన్‌ అనే వ్యక్తికి చెందిన ఓ కోడి మాత్రం రోజూ తెల్లవారుజామునే కూస్తూ మోడీ నిద్రకు భంగం కలిగించేది. ఈ విషయమై అతను విజయన్‌తో పలుమార్లు చర్చలు జరిపాడు. మీ కోడి వల్ల నాకు నిద్రాభంగం అవుతోందని దాన్ని బోనులో పెట్టాలని కోడి ఓనర్ కు తెలిపాడు. అయితే అది సాధ్యం కాలేదు.

ముంబైలో దారుణం, తాగిన మత్తులో స్నేహితుడి ఆ పార్టులో చపాతీ కర్రను గట్టిగా దూర్చిన మిగతా స్నేహితులు, తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితుడు

దీంతో విసిగుచెందిన మోడీ.. చేసేదేంలేక పాలసియా పోలీసులను ఆశ్రయించాడు. కోడి కూస్తూ తన నిద్రకు భంగం కలిగిస్తోందని ఫిర్యాదు చేశాడు.రోజంతా ఆసుపత్రిలో బిజీగా ఉండి.. అలసిపోయి రాత్రి ఇంటికొచ్చి పడుకుంటున్నానని.. అయితే, తన ఇంటి సమీపంలో ఉన్న వందన విజయన్‌కు చెందిన కోడి రోజూ తెల్లవారుజామున 4-5 గంటల మధ్య కూస్తూ నిద్రకు భంగం కలిగిస్తోందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కోడితోపాటు.. నాలుగు కుక్కలు కూడా మొరుగుతూ.. ఇబ్బందిపెడుతున్నాయని ఫిర్యాదులో తెలిపాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వందన విజయన్‌పై సెక్షన్‌ 138 కింద కేసు నమోదు చేశారు.ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పలాసియా పోలీస్ స్టేషన్‌ అధికారి సంజయ్ బాయిస్ తెలిపారు.