Madhya Pradesh: కిడ్నాపర్లకు రూ. 15 లక్షలు చెల్లించేందుకు.. చందాలు వేసుకుంటున్న గ్రామస్థులు.. మధ్యప్రదేశ్‌లోని ష్యోపూర్‌లో ఘటన

కిడ్నాపర్లు డిమాండ్ చేసిన మొత్తం కోసం గ్రామస్థులు తలా ఇంత చందా వేసుకుంటున్నారు.

Credits: Twitter/ANI

Bhopal, Jan 21: ఓ నేరస్తుల ముఠా కిడ్నాప్ (Kidnap) చేసిన తమవారిని విడిపించుకునేందుకు ఊరంతా ఏకమైంది. కిడ్నాపర్లు డిమాండ్ (Demand) చేసిన మొత్తం కోసం గ్రామస్థులు (Villagers) తలా ఇంత చందా వేసుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని (Madhyapradesh) ష్యోపూర్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రామ్‌ స్వరూప్ యాదవ్, భట్టు బఘేల్, గుడ్డా బఘేల్ నాలుగు రోజుల నుంచి కనిపించకుండా పోయారు. వారి కోసం ఆరా తీస్తున్న క్రమంలో రాజస్థాన్‌లోని ఓ ముఠా వారిని కిడ్నాప్ చేసినట్టు తెలిసింది.

ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. ఇక తెలుగులోనూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష.. హిందీ, ఇంగ్లిష్‌తోపాటు 13 స్థానిక భాషల్లోనూ పరీక్ష

వారిని సంప్రదిస్తే రూ. 15 లక్షలు చెల్లిస్తే వారిని విడిచిపెడతామని చెప్పారు. ఆ మాట విన్న బాధిత కుటుంబాలు షాకయ్యారు. వారంతా పేదలు కావడంతో అంత సొమ్ము ఎక్కడి నుంచి తీసుకురావాలో వారికి అర్థం కాలేదు. విషయం తెలిసిన గ్రామస్థులు రంగంలోకి దిగారు. గ్రామమంతా చందాలు వేసుకుని కిడ్నాపర్ల బారి నుంచి తమ వారిని విడిపించుకోవాలని నిర్ణయించారు.

డ్రైవర్ మూడ్ ను బట్టి రంగులు మార్చే బీఎండబ్ల్యూ కారు... అదరగొట్టే రంగులతో కళ్లు జిగేల్.. వీడియో ఇదిగో!