Los Vegas, Jan 21: జర్మనీ (Germany) కార్ల (Cars) తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ (BMW) అమెరికాలోని (America) లాస్ వేగాస్ (Los Vegas) లో జరుగుతున్న సీఈఎస్ (CES) ఈవెంట్ (Event) లో ఓ కొత్త కారును ప్రదర్శించింది. ఆ కారును చూసి అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఎందుకంటే, ఆ కారు 240 రంగులు మార్చింది. ఈ కారు పేరు ఐ విజన్ డి. పరిస్థితులను బట్టి రంగులు మార్చే అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇందులో ఉపయోగించారు. డ్రైవర్ ఏ మూడ్ లో ఉన్నాడన్నది పరిగణనలోకి తీసుకుని ఈ కారు రంగులు మార్చేస్తుంది. అందుకోసం ఈ-ఇంక్ టెక్నాలజీ ఉపయోగించారు.
ఈ ఐ విజన్ డి కారును భారత్ లోనూ తీసుకువచ్చేందుకు బీఎండబ్ల్యూ ప్రణాళికలు రచిస్తోంది. అయితే, రెండేళ్ల తర్వాతే ఇది భారత్ లోకి రానుంది. ప్రస్తుతం అభివృద్ధి దశలోనే ఉన్న ఈ కారును త్వరలోనే వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసేందుకు బీఎండబ్ల్యూ సన్నద్ధమవుతోంది. ఈ కారులో మరో కొత్త టెక్నాలజీ కూడా ఉంది. ఓ సినిమా తెరపై ప్రదర్శించినట్టుగా, కారు విండ్ షీల్డ్ పై డిజిటల్ ఫార్మాట్ లో డ్రైవింగ్ డేటాను పొందే వీలుంది. కారు వేగం, మైలేజి, నేవిగేషన్ వంటి అంశాలను కారు విండ్ షీల్డ్ పై చూడొచ్చట.
Dee comes full colour ?⚪️???
Introducing the BMW i Vision Dee with full-colour E Ink technology. The tech allows for a vibrant, individually configurable exterior with up to 32 different colours. #BMWGroup #THEiVisionDee #TheUltimateCompanion #CES2023 #innovation pic.twitter.com/ynMq0prCCN
— BMW Group (@BMWGroup) January 6, 2023