Wedding on Flight: విమానంలోనే పెళ్లి తంతును పూర్తి చేసిన జంట, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, తమిళనాడు మధురై నుంచి బెంగుళూరు మీదుగా సాగిన పెళ్లి విమానం

ఇప్పడు ఈ విమానంలో పెళ్లి (Wedding on Flight) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Madurai Couple Ties Knot On Board SpiceJet flight (Photo Credits: Twitter)

పెళ్లిల్లు స్వర్గంలో జరుగుతాయని అంటారు..అయితే స్వర్గంలో కాదు కాని ఆకాశంలో చక్కర్లు కొట్టిన విమానంలో ఓ జంట పెళ్లి ( Madurai Couple Gets Married on Plane) చేసుకుని ఒక్కటయ్యారు. ఇప్పడు ఈ విమానంలో పెళ్లి (Wedding on Flight) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తమిళనాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. వైరల్ పెళ్లి పూర్తి వివరాల్లోకెళితే.. తమిళనాడుకు చెందిన రాకేష్, దక్షిణల పెళ్లి మంగళవారం జరగాల్సి ఉంది. దీని కోసం ఇరు కుటుంబాల పెద్దలు అయితే కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో తమిళనాడు సర్కార్ రేపటి(మంగళవారం) నుంచి రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ (Lockdown in Tamil Nadu) ప్రకటించింది.

దీంతో పెళ్లి కోసం చేసుకున్న ఏర్పాట్లను కూడా రద్దు చేసుకున్న ఇరు కుటుంబాలు విమానంలోనే వివాహ తంతు కానిచ్చేశాయి. అందరి సమక్షంలో పెళ్లి చేసుకోవాలని అనుకున్న ఈ జంట మదురై-బెంగళూరు నుండి మొత్తం విమానాన్ని రెండు గంటలు బుక్ చేసుకుని, తమ విమానం మదురై మీనాక్షి అమ్మన్ ఆలయం మీదుగా 161 మంది బంధువుల సమక్షంలో పెళ్లితో ఒక్కటయ్యారు.

యువకుడి చెంప చెల్లుమనిపించిన కలెక్టర్ రణబీర్ శర్మ, తరువాత క్షమాపణ కోరుతూ వీడియో విడుదల, ఘటనను ఖండించిన ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్, కలెక్టర్‌ను విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు

అనుకున్న ముహర్తానికి వరుడు ఆకాశంలో చక్కర్లు కొట్టిన విమానంలోనే వధువు మెడలో తాలి కట్టాడు. ఇరు కుటుంబాల సమక్షంలో యువ జంట ఒక్కటవ్వగా కుటుంబ సభ్యులు వారిని ఆశీర్వదించారు.

Here's Video

ఆకాశంలో వివాహం చేసుకున్న మధురైకి చెందిన రాకేశ్-దక్షిణా అనే క్యాప్షన్‌తో ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన తర్వాత, ప్రత్యేకమైన వివాహం యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెంగళూరు నుండి మదురైకి స్పైస్ జెట్ విమానంలో వెళ్లిన వీరంతా వివాహం తరువాత మదురై నుండి బెంగళూరుకు బయలు దేరారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif