Earthquake in Bay of Bengal: బంగాళాఖాతంలో భూకంపం.. తీవ్రత 4.2గా నమోదు.. అండమాన్ తీరానికి పోటెత్తిన అలలు
దీంతో అలలు తీరప్రాంతాలకు పోటెత్తాయి. మంగళవారం తెల్లవారుజామున 5.32 గంటలకు బంగాళాఖాతంలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.2గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
Newdelhi, Nov 7: బంగాళాఖాతంలో (Bay of Bengal) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. దీంతో అలలు తీరప్రాంతాలకు పోటెత్తాయి. మంగళవారం తెల్లవారుజామున 5.32 గంటలకు బంగాళాఖాతంలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.2గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులకు (Andaman and Nicobar Islands) వాయవ్య దిశగా సుమారు 200 నాటికల్‌మైళ్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించింది. సముద్రగర్భంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని తెలిపింది. భూకంపం వల్ల అండమాన్ నికోబార్ దీవులు ప్రభావితమయ్యాయి. తీరంలో అలలు పోటెత్తడంతో సముద్రంలో అల్లకల్లోలంగా మారింది. కాగా, తీర ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించిన అధికారులు.. సునామీ ముప్పు లేదని తెలిపారు.
Prevention of Ageing Process: వృద్ధాప్యాన్ని అడ్డుకునే విటమిన్-సీ.. చైనా సైంటిస్టుల వెల్లడి
వరుస భూకంపాలు
సోమవారం ఉత్తరాఖండ్ లోని పితోరాగ్రాఫ్ జిల్లాలో 5.6 తీవ్రతతో భూమి కంపించింది. అయితే దీనివల్ల ఎలాంటి నష్టం జరగలేదు. ఇక నేపాల్ లోని కఠ్మండూలో నిన్న ఉదయం 5.2 తీవ్రతతో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. అదేవిధంగా గత శుక్రవారం అర్ధరాత్రి నేపాల్‌లో 6.9 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. దీని ప్రభావంతో ఉత్తర భారతదేశంలోనూ భూమి కంపించింది. భూకంపం ధాటికి 150 మందికిపైగా మరణించారు.