
Hyderabad, Nov 7: మానవుడి వెన్నుపాములోని ప్రత్యేక లక్షణాలున్న కొన్ని జీవకణాలు వృద్ధాప్యానికి కారణమవుతున్నాయని, విటమిన్-సీ సప్లిమెంట్స్ (vitamin C supplements) తో వృద్ధాప్య ప్రక్రియను అడ్డుకోవచ్చునని (Prevention of Ageing Process) చైనా సైంటిస్టులు (Chinese researchers) చెబుతున్నారు. దీనికి సంబంధించి కోతులపై జరిపిన పరిశోధనలు సక్సెస్ అయ్యాయని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వార్తా కథనాలు వెలువరించాయి. ఈ కథనం ప్రకారం, బీజింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు చెందిన సైంటిస్టుల బృందాలు 7 సంవత్సరాలుగా ‘యాంటీ-ఏజింగ్’పై పరిశోధనలు జరిపాయి.
Chinese researchers claimed to have identified a unique group of cells that contributes to the ageing process and might be mitigated with everyday vitamin C supplements.https://t.co/G4v2nSrb6d
— Deccan Herald (@DeccanHerald) November 6, 2023
మనిషి వెన్నుపాములోని ప్రత్కేక లక్షణాలున్న కణాల సముదాయం వృద్ధాప్యానికి కారణమవుతున్న మోటార్ న్యూరాన్లను ఉత్పత్తి చేస్తున్నది. అత్యంత సున్నితమైన ఈ కణాల జీవితకాలాన్ని విటమిన్-సీ పెంచిందని 10 కోతులపై సైంటిస్టులు జరిపిన పరిశోధనలో తేలింది. ట్యాబ్లెట్ల రూపంలో విటమిన్-సీ తీసుకున్నా వృద్ధాప్య ప్రక్రియను అడ్డుకోవచ్చునని సైంటిస్టుల పరిశోధన అభిప్రాయపడింది.