Boulders on Railway Track: పూణె-ముంబై మార్గంలో రైలు పట్టాలపై బండరాళ్లు పెట్టిన దుండగులు.. గుర్తించి తొలగించిన రైల్వే సిబ్బంది.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. వీడియో ఇదిగో!

ఈ మార్గంలో రైలు పట్టాలపై ఐదు వేర్వేరు చోట్ల దుండగులు బండరాళ్లు పెట్టారు.

Boulders on Railway Track (Credits: X)

Pune, Oct 7: పూణె-ముంబై రైలు మార్గంలో (Pune-Mumbai Train Route) మరో పెను ప్రమాదం తప్పింది. ఈ మార్గంలో రైలు పట్టాలపై (Railway Tracks) ఐదు వేర్వేరు చోట్ల దుండగులు బండరాళ్లు (Boulders on Railway Track) పెట్టారు. రైలు వస్తున్నప్పుడు అదురుకు అవి పడిపోకుండా వాటికి సపోర్టుగా మరికొన్ని రాళ్లు పేర్చారు. నిన్న మధ్యాహ్నం 3.40 గంటల సమయంలో పూణె-ముంబై ట్రాక్ పై  వీటిని గుర్తించిన రైల్వే అధికారులు తొలగించడంతో ప్రమాదం తప్పింది. ఇది తప్పకుండా సంఘవిద్రోహ శక్తుల పనేనని అధికారులు తెలిపారు.

Asian Games India Record: ఆసియా క్రీడల్లో భారత్ కొత్త చరిత్ర.. వంద పతకాలతో సరికొత్త రికార్డు.. మహిళల కబడ్డీ ఫైనల్‌ లో భారత్ చేతిలో చైనీస్‌ జట్టు చిత్తు.. మొత్తంగా భారత్ కు ఏయే పతకాలు ఎన్ని వచ్చాయంటే?

నాలుగు రోజుల క్రితం కూడా ఇలాగే..

నాలుగు రోజుల క్రితం నార్త్ వెస్ట్రన్ రైల్వే  (ఎన్‌డబ్ల్యూఆర్) అధికారులు ఉదయ్‌పూర్-జైపూర్ ట్రాక్‌పైనా బండరాళ్లను గుర్తించారు. ఫిష్‌ ప్లేట్ల ను కూడా దుండగులు ట్రాక్‌పై పెట్టారు. గమనించిన వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ రైలు సిబ్బంది బ్రేకులు వేసి ప్రమాదాన్ని నివారించారు.

KCR Chest Infection: వైరల్ జ్వరం తర్వాత ఇప్పుడు చాతీలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆందోళన అవసరం లేదన్న కేటీఆర్.. వీడియోతో