Hyderabad, Oct 7: ఇటీవల వైరల్ జ్వరం (Viral Fever) బారినపడిన తెలంగాణ సీఎం కేసీఆర్ కు (Telangana CM KCR) చాతీలో ఇన్ఫెక్షన్ (Chest Infection) అయింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభోత్సవం సందర్భంగా జాతీయ మీడియా చానల్ ఎన్డీటీవీతో మంత్రి మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత చాతీలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ మొదలైందని పేర్కొన్నారు.
CM KCR ఆరోగ్య సమస్య పై స్పష్టత ఇచ్చిన KTR.
సీఎం కేసీఆర్ కు ఛాతిలో సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చిందని వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం వైరల్ ఫీవర్, ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల కోలుకోవడానికి అనుకున్న సమయం కంటే ఎక్కువ కాలం పట్టే అవకాశం ఉందని చెప్పారు. Courtesy: NDTV pic.twitter.com/cpjrHyTZ9E
— Murali Krishna TV9 (@encounterwithmk) October 6, 2023
త్వరలోనే ప్రజల ముందుకు
అయితే, ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కోలుకుని త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని తెలిపారు.