వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్‌ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనున్న సంగతి విదితమే. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు బిగ్‌ షాక్‌ తగిలింది. టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ డెంగ్యూతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గిల్‌ ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం. కాగా గిల్‌కు శుక్రవారం మరోసారి రక్తపరీక్షలు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫలితం బట్టి జట్టు మేనెజ్‌మెంట్‌ ఓ నిర్ణయం తీసుకుంటుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.ఒకవేళ గిల్‌ తొలి మ్యాచ్‌కు దూరమైతే నిజంగా భారత్‌కు అది గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి.

Shubman Gill (Photo-Twitter/BCCI)

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)