దోమల బెడదతో ఇబ్బంది పడని వారుండరూ. దోమలు కుట్టకుండా అనేక ప్రయత్నాలు చేస్తారు. అయితే దోమల బెడద నుండి మాత్రం బయటపడలేరు. అయితే ఫిలిప్పీన్స్‌లో(Philippines) దోమల నియంత్రణకు అదిరే ఆఫర్ ప్రకటించారు(Catch 5 Mosquitoes).
డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేసులను ఎదుర్కొనేందుకు మనీలాAddition Hills గ్రామంలో ఒక ప్రత్యేకమైన పథకాన్ని ప్రవేశపెట్టారు. గ్రామస్థులు ఐదు దోమలను – అవి బ్రతికైనా, చనిపోయినవైనా – గ్రామ కార్యాలయానికి తేవాలని కోరారు. ప్రతిగా వారికి ఒక్కో దోమకు ఒక పిసో (సుమారు 1.5 భారతీయ రూపాయలు) బహుమతిగా అందించనున్నారు!
ఒక దోమకు ఒక పిసో అనే ఈ ప్రాజెక్ట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది(viral video). ప్రజలు దోమలతో క్యూ లైన్‌లో నిలబడుతుండటం విశేషం. దీనిపై నెటిజన్లు తమదైన శైలీలో కామెంట్ చేస్తున్నారు. ఎవరైనా ఇంట్లో దోమలను పెంచుకుంటూ, త్వరగా డబ్బు సంపాదించేందుకు ప్రయత్నిస్తారా? అని చెబుతుండగా ఈ ఆఫర్‌కు మాత్రం స్థానికంగా మంచి స్పందన వస్తోంది.
Philippines Village Offers Prize Money for Catch 5 Mosquitoes
VIDEO: 'Peso for a mosquito': Philippines village offers cash rewards to fight dengue.
Filipinos in Manila's Addition Hills village exchange containers of mosquitoes for cash, as the government attempts to address rising dengue cases in the country. The "Peso for a Mosquito"… pic.twitter.com/e4l05eKaxL
— AFP News Agency (@AFP) February 20, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)