Hens Stopped Laying Eggs: గుడ్లు పెట్టడం మానేసిన కోళ్లు, లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన పౌల్ట్రీ యజమానులు, మహారాష్ట్రలోని పుణేలో విచిత్ర ఘటన
అక్కడ కోళ్లు గుడ్లు పెట్టడం (Hens Stopped Laying Eggs) మానేశాయి. దీంతో పలువురు పౌల్ట్రీ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Pune, April 21: మహారాష్ట్రలోని పూణె జిల్లాలో పోలీసులకు విచిత్ర కేసు ఎదురయింది. అక్కడ కోళ్లు గుడ్లు పెట్టడం (Hens Stopped Laying Eggs) మానేశాయి. దీంతో పలువురు పౌల్ట్రీ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచిత్ర ఘటనలోకి వెళ్తే.. కల్భోర్ పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర మోకాషి (Rajendra Mokashi) చెప్పిన వివరాల ప్రకారం.. ఒక కంపెనీ తయారు చేసిన ఆహారం తిన్నతరువాత నుంచి తమ పౌల్ట్రీ ఫారాల్లోని కోళ్లు గుడ్లు పెట్టడం (hens stop laying eggs) మనేశాయని వారు పోలీసులకు ఫిర్యాదు (Poultry farmers approaches police) చేశారు.
ఈ కోళ్ల దాణాను సప్లయ్ చేసిన సంస్థ మూడు నాలుగు పౌల్ట్రీఫారాలకు కూడా దాణా సప్లయ్ చేసిందన్నారు. ఆయా పౌల్ట్రీ ఫారాలలో ఇటువంటి సమస్యే తలెత్తిందన్నారు. తమ వద్దకు నలుగురు పౌల్ట్రీ యజమానులు... తమ కోళ్లు దాణా తిన్న తరువాత నుంచి గుడ్లు పెట్టడం మానేశాయని ఫిర్యాదు చేశారన్నారు. దీంతో సదరు కంపెనీపై కేసు నమోదు చేశామన్నారు.
ఫిర్యాదుదారు తెలిపిన వివరాల ప్రకారం అహ్మద్‌నగర్ జిల్లాలోని ఒక కంపెనీ నుంచి కోళ్ల దాణాను కొనుగోలు చేశామని, దానిని కోళ్లకు పెట్టినప్పటి నుంచి ఒక్క గుడ్డు కూడా పెట్టడం లేదని వాపోయారు. కోడికి కొత్త ఫీడ్ ఇచ్చిన తర్వాత గుడ్లు పెట్టని సందర్భాలు గతంలో జరిగాయని వారు గుర్తు చేశారు. అలాగే కోళ్ళు పాత ఫీడ్ తినిపించిన తర్వాత అవి మళ్ళీ గుడ్లు పెట్టడం ప్రారంభించాయని పోలీస్ అధికారి తెలిపారు.
ఈ కేసు మీద ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టిన పోలీసులు సదరు కంపెనీ ప్రతిధులను విచారిస్తున్నారు. అలాగే ఈ విషయమై పశువైద్య అధికారులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటున్నారు.అయితే సమస్యను ఎదుర్కుంటున్న పౌల్ట్రీ యజమానులకు పరిహారం చెల్లించడానికి సంబంధిత తయారీదారు అంగీకరించినందున ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పోలీస్ అధికారి తెలిపారు. కాగా మహారాష్ట్రలో COVID-19 కేసులు పెరగడం వల్ల గుడ్లు, పౌల్ట్రీలకు డిమాండ్ పెరుగుతోంది.