Delhi Viral News: డబ్బు కోసం దురాశ.. పేరోల్‌ లో భార్య పేరు.. పదేళ్లపాటు సంస్థను రూ. 4 కోట్ల వరకు మోసగించిన హెచ్ఆర్ ఉద్యోగి.. ఆ డబ్బుతో ఆస్తుల కొనుగోలు.. ఢిల్లీలో ఘటన

ఇదీ అలాంటి ఘటనే.. తనకొస్తున్న జీతం డబ్బులతో సంతృప్తి పడని ఓ హెచ్ఆర్ ఉద్యోగి పనిచేస్తున్న సంస్థను పదేళ్లపాటు మోసం చేశాడు. అలా రూ. 4 కోట్ల మేర వెనకేసుకొని ఆస్తులు కొన్నాడు. చివరికి అడ్డంగా దొరికిపోయాడు.

Digital (Representative Image of Workplace (Photo Credits: File Image)

Newdelhi, Aug 1: దురాశ మనిషిని ఎంతకైనా తెగించేలా చేస్తుందంటారు. ఇదీ అలాంటి ఘటనే..  తనకొస్తున్న జీతం (Salary) డబ్బులతో సంతృప్తి పడని ఓ హెచ్ఆర్ ఉద్యోగి (HR Employee) పనిచేస్తున్న సంస్థను పదేళ్లపాటు మోసం (Cheat) చేశాడు. అలా రూ. 4 కోట్ల మేర వెనకేసుకొని ఆస్తులు (Properties) కొన్నాడు. చివరికి అడ్డంగా దొరికిపోయాడు. ఢిల్లీలో జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళ్తే..   మ్యాన్‌ పవర్ గ్రూప్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ (ManpowerGroup Service Private Limited) లో రాధా వల్లభ్‌నాథ్ అనే వ్యక్తి 2008లో అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్)గా ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత మేనేజర్ స్థాయికి ఎదిగాడు. అయితే, తనకొస్తున్న జీతంతో సంతృప్తి చెందని రాధా వల్లభ్ ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఖాళీగా ఉంటున్న తన భార్య పేరును కంపెనీ పేరోల్‌ లో చేర్చాడు. ఫలితంగా ప్రతి నెల ఆమె ఖాతాలో జీతం డబ్బులు పడేవి. ఇలా పదేళ్లపాటు దాదాపు సంస్థకు దాదాపు రూ. 4 కోట్ల మేర నష్టం కలిగించాడు.

Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయాణంలో మరో కీలక ఘట్టం.. భూ కక్ష్యను వీడి చంద్రుడి దిశగా చంద్రయాన్-3 ప్రయాణం ప్రారంభం

మూడు ప్రాంతాల్లో ఆస్తుల కొనుగోలు

ఆ సొమ్ముతో అతడు ఢిల్లీ, జైపూర్‌తోపాటు ఆయన స్వస్థలమైన ఒడిశాలో ఆస్తులు కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో తేలింది. మ్యూచువల్ ఫండ్స్‌లోనే భారీగా పెట్టుబడులు పెట్టినట్టు సంస్థ ఆరోపించింది. ఉద్యోగి మోసాన్ని గుర్తించిన సంస్థ అతడిని నిరుడు డిసెంబరులో ఉద్యోగం నుంచి తొలగించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Maharashtra Horror: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. గిర్డర్ యంత్రం కూలి 16 మంది మృతి.. థానే జిల్లా షాపూర్‌లో ఘటన.. సమృద్ధి ఎక్స్‌ ప్రెస్ హైవే ఫేస్-3 రోడ్డు పనులు, బ్రిడ్జి నిర్మిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ప్రమాదం