Maharashtra Horror: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. గిర్డర్ యంత్రం కూలి 16 మంది మృతి.. థానే జిల్లా షాపూర్‌లో ఘటన.. సమృద్ధి ఎక్స్‌ ప్రెస్ హైవే ఫేస్-3 రోడ్డు పనులు, బ్రిడ్జి నిర్మిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ప్రమాదం
Credits: Twitter

Mumbai, August 1: మహారాష్ట్రలో (Maharastra) ఈ తెల్లవారుజామున ఘోర ప్రమాదం (Accident) జరిగింది. బ్రిడ్జ్ నిర్మాణం (Bridge Construction) కోసం ఏర్పాటు చేసిన గిర్డర్ (Girder) అకస్మాత్తుగా కూలడంతో 16 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. థానే జిల్లా (Thane) షాపూర్‌లో సమృద్ధి ఎక్స్‌ ప్రెస్ హైవే ఫేస్-3 రోడ్డు పనులకు సంబంధించి బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన గిర్డర్ యంత్రం ఒక్కసారిగా కార్మికులపై పడింది. పిల్లర్లతో అనుసంధానించే ఈ యంత్రం వంద అడుగుల ఎత్తు నుంచి పడినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసు ఘటాన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించారు. నిర్మాణ కింద చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే (CM Eknath Shinde), ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ (Devendra Fadnavis) పరిశీలించారు.

TSRTC Merger With Government: తెలంగాణ ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ విలీనంతో పండగ చేసుకుంటున్న ఆర్టీసీ ఉద్యోగులు..మా బాపు కేసీఆర్ అంటూ నినాదాలు..

ఫడ్నవీస్‌ కళల ప్రాజెక్టు

కాగా, సమృద్ధి మహామార్గ్‌ (Samruddhi Mahamarg)ను నాగ్‌పూర్‌-ముంబై మధ్య నిర్మిస్తున్నారు. మొత్తం 701 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారిని డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌ కళల ప్రాజెక్టుగా పేర్కొంటారు. ఇప్పటికే ఈ ఎక్స్‌ప్రెస్‌ వేలో రెండు దశలు పూర్తయ్యాయి. మే 26న రెండో దశలో భాగంగా నిర్మించిన నాసిక్‌లోని షిర్డీ-భర్వీర్‌ మధ్య నిర్మించిన మార్గాన్ని సీఎం షిండే ప్రారంభించారు. దీంతో సమృద్ధి మహామార్గ్‌లో 600 కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చినట్లయింది.

Dasoju Shravan: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ అభ్యర్ధులుగా ఎంపిక.