Heavy Rain in Hyderabad: హైద‌రాబాద్‌ లో కాలువలైన రోడ్లు.. బైక్ తో సహా కొట్టుకుపోయిన యువకుడు.. కాపాడిన స్థానికులు (వైరల్ వీడియో)

అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్ర రాజధాని హైద‌రాబాద్‌ అతలాకుతలం అవుతున్నది.

Man washed up (Credits: X)

Hyderabad, Aug 20: అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో (Heavy Rains) రాష్ట్ర రాజధాని హైద‌రాబాద్‌ (Hyderabad) అతలాకుతలం అవుతున్నది. న‌గ‌రంలోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్ల మీద నీళ్లు వరుదలా పారడంతో ఉదయం ఆఫీసులకు వెళ్లే వాహనదారులకు, స్కూళ్లకు వెళ్లే పిల్లలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో రాంనగర్ లో ఓ వ్యక్తి బైక్ మీద నీటికి ఎదురుగా వెళ్లాలని యత్నించాడు. నీటి ప్రవాహానికి బైక్ సహా కొట్టుకుపోయాడు. గమనించిన స్థానికులు అతన్ని రక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

హైద‌రాబాద్‌ లో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా దంచికొడుతున్న వాన‌.. పలు ప్రాంతాలు జలమయం

వానలు ఎక్కడెక్కడ అంటే?

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్ పేట, మెహదీపట్నం, హిమాయత్ నగర్, దిల్‌ సుఖ్ నగర్, మలక్ పేట, వనస్థలిపురం, అబిడ్స్‌, నాంప‌ల్లి, నాగోల్‌, అంబ‌ర్ పేట్‌, అబ్దుల్లాపూర్‌ మేట్, జీడిమెట్ల‌, సూరారం, సుచిత్ర‌, బషీర్ బాగ్, ఉప్పల్, ఫిల్మ్ నగర్, నారాయణగూడ, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎర్రమంజిల్, లక్డికాపుల్, బీఎన్ రెడ్డి న‌గ‌ర్‌, హ‌య‌త్ న‌గ‌ర్‌, జ‌గ‌ద్గిరిగుట్ట‌, బోయిన్ పల్లి, బ‌హ‌దూర్ ప‌ల్లి, గుండ్ల‌పోచం ప‌ల్లి, పేట్ బ‌షీరాబాద్‌ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది.

కలకత్తా వైద్యురాలి హత్యాచారం కేసులో కీలక పరిణామం, ప్రధాన నిందితుడికి పాలిగ్రాఫ్‌/లై డిటెక్టర్‌ టెస్ట్ చేయనున్న సీబీఐ, అనుమతించిన కలకత్తా హైకోర్టు