World’s Richest Dog: ఈ శునకం గారు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనది.. దీని ఆస్తుల విలువ రూ.3,300 కోట్లు మరి.. ఏంటా విషయం?

ఇది అలాంటి ఇలాంటి కుక్క కాదు. దీనికి ఓ విమానం, యాట్‌ సహా బీఎండబ్ల్యూ కారు ఉన్నాయి.

Dog (Credits: X)

Newdelhi, Aug 30: కింది ఫొటోలో కనిపిస్తున్న జర్మన్‌ షెఫర్డ్‌ శునకం పేరు గుంథెర్‌-6 (Gunther VI). ఇది అలాంటి ఇలాంటి కుక్క కాదు. దీనికి ఓ విమానం, యాట్‌ సహా బీఎండబ్ల్యూ కారు ఉన్నాయి. ఈ శునకం గారికి సేవ చేయడానికి 27 మంది సిబ్బంది, రుచికరమైన ఆహారాన్ని సిద్ధం చేయడానికి ఓ స్పెషల్ చెఫ్‌ కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ కుక్కకు రూ.3వేల కోట్లకు పైగా ఆస్తులున్నాయి. అందుకే, ప్రపంచంలోనే అత్యంత సంపన్న శునకంగా (World’s Richest Dog) ఇది గిన్నిస్‌ రికార్డులకెక్కింది.

రానున్న పండుగల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త.. 60 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్టు ప్రకటన.. ఏ మార్గాల్లో అంటే??

ఎక్కడిదీ ఇంత ఆస్తి?

కర్లోటా లీబెన్‌ స్టీన్‌ అనే శ్రీమంతుడికి ఒక్కగానొక్క కుమారుడు ఉండేవాడు. అయితే, 1992లో అతను మరణించాడు. దీంతో ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి గుంథెర్‌-3ని అతను పెంచుకున్నాడు. అనతికాలంలోనే ఆ శునకం తన మనసుకు ఎంతో దగ్గరైంది. దీంతో కర్లోటా లీబెన్‌ స్టీన్‌ తన ఆస్తినంతటినీ ఈ కుక్క పేరు మీద రాశారు. ఈ ఆస్తుల నిర్వహణ బాధ్యతలను తన ఇటాలియన్‌ స్నేహితుడు మౌరిజియో మియాన్‌ కు అప్పగించారు. అయితే, మియాన్‌ ఈ ఆస్తులను విపరీతంగా పెంచాడు. దాదాపు వాటి విలువ రూ. 3,300 కోట్లకు చేరింది. దీంతో గుంథెర్‌-6కు కళ్లు చెదిరే స్థాయిలో ఆస్తులు చేకూరాయి.

తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్, వచ్చే 5 రోజుల పాటు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం..