550 Hajj Pilgrims Die In Mecca: పవిత్ర మక్కాలో మృత్యుఘోష, హజ్‌ యాత్రకు వెళ్ళిన 550కి పైగా యాత్రికులు మృతి, ఎండలు, ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు

ఈ ఏడాది హజ్ యాత్రలో కనీసం 550 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారని దౌత్యవేత్తలు మంగళవారం ధృవీకరించారు.మక్కాలో హీటెక్కిన ఉష్ణోగ్రతల మధ్య తీర్థయాత్ర యొక్క కష్టతరమైన పరిస్థితులను ఎత్తిచూపారు.

Muslim Pilgrims Circumambulate The Kaaba, The Cubic Building At The Grand Mosque, During The Annual Hajj Pilgrimage In Mecca, Saudi Arabia (Photo: PTI)

పవిత్ర హజ్‌ యాత్రలో మృత్యుఘోష వినబడింది. ఈ ఏడాది హజ్ యాత్రలో కనీసం 550 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారని దౌత్యవేత్తలు మంగళవారం ధృవీకరించారు.మక్కాలో హీటెక్కిన ఉష్ణోగ్రతల మధ్య తీర్థయాత్ర యొక్క కష్టతరమైన పరిస్థితులను ఎత్తిచూపారు. మరణించినవారిలో 323 మంది ఈజిప్షియన్లు, 60 మంది జోర్డానియన్లు ఉన్నారు, ప్రధానంగా వేడి-సంబంధిత అనారోగ్యాలకు లోనయి మరణించారని తెలిపారు.

ఇద్దరు అరబ్ దౌత్యవేత్తలు వారి సంబంధిత దేశాల నుండి ప్రతిస్పందనలను సమన్వయం చేస్తున్నారు.అంతకుముందు రోజు అమ్మన్ అందించిన 41 మరణాల అధికారిక గణనను సవరించారు. AFP లెక్కల ప్రకారం, ఇది బహుళ దేశాల నుండి నివేదించబడిన మొత్తం మరణాలను 577గా రికార్డు అయింది. ఇక గ‌తేడాది కూడా హ‌జ్ యాత్ర‌లో 240కి పైగా మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. వీరిలొ ఇండోనేషియన్లు ఎక్కువ మంది ఉన్నారు. భారతదేశంలో ఉన్న సీక్రెట్ టెంపుల్స్ గురించి తెలుసా, ప్రతిరోజూ షాకింగ్ సంఘటనలు ఈ ఆలయాలలో జరుగుతాయంటే నమ్మగలరా..

వీరంతా వేడి సంబంధిత స‌మ‌స్య‌ల‌తోనే మ‌ర‌ణించిన‌ట్లు వెల్ల‌డించారు. వేడిమి నుంచి ఉపశమనం కలిగించేందుకు అక్కడి అధికారులు చర్యలు తీసుకుంటున్నా ప్రాణ నష్టం తప్పడం లేదు. ఇక మక్కాలోని అతిపెద్ద ఆసుప‌త్రుల‌లో ఒక‌టైన‌ అల్-ముయిసెమ్ ఆసుప‌త్రి మార్చురీలో మొత్తం 550 మృత‌దేహాలు ఉన్నట్లు దౌత్యవేత్తలు తెలిపారు. వేడి సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డిన సుమారు 2,000 మంది యాత్రికులకు చికిత్స అందించిన‌ట్లు సౌదీ అధికారులు తెలిపారు.  15 రోజుల క్రితం ప్రారంభమైన చార్‌ ధామ్‌ యాత్రలో ఇప్పటివరకు 50 మందికి పైగా భక్తులు మృతి.. గర్హాల్‌ కమిషనర్‌ వెల్లడి

ప్ర‌స్తుతం మ‌క్కాలో 50 డిగ్రీల‌కు పైగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదవుతున్నాయి. మక్కాలోని గ్రాండ్ మసీదు వద్ద సోమవారం 51.8 డిగ్రీల సెల్సియస్ (125 ఫారెన్‌హీట్) ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని సౌదీ జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో హజ్‌ యాత్రకు వెళ్లిన భక్తుల కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా ప్రతి దశాబ్దం సౌదీ అరేబియాలో 0.4 డిగ్రీల వేడి పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశం.

హజ్‌ యాత్ర ఈనెల 19వ తేదీతో (బుధవారం) ముగియనుంది. ఈ మతపరమైన కార్యక్రమం ద్వారా సౌదీ అరేబియా ఏడాదికి 12 బిలియన్ డాల‌ర్లు ఆర్జిస్తుంది. విజ‌న్ 2030 రోడ్‌మ్యాప్‌లో భాగంగా సౌదీ అరేబియా 2030 నాటికి హజ్, ఉమ్రా రెండింటి ద్వారా మతపరమైన పర్యాటకుల సంఖ్యను 30 మిలియన్లకు పెంచాలని ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఇక ఈ యాత్రలు చేసే ప‌ర్యాట‌కులు ఆహారం, ప్రయాణం, వసతి, ఇతర వాటికి వెచ్చించే న‌గ‌దుతో ఆ దేశ ఖ‌జానాకు భారీ ఆదాయం స‌మ‌కూరుతోంది. కాగా, హజ్ ఖర్చు ఒక వ్యక్తికి 3 వేల డాల‌ర్ల నుంచి 10 వేల డాల‌ర్ల‌ మధ్య ఉంటుందని అంచనా.