IPL Auction 2025 Live

Namma Yatri App: యాప్‌ ద్వారా ఒక్క ఏడాదిలోనే రూ.189 కోట్లు సంపాదించిన బెంగళూరు ఆటో డ్రైవర్లు..

అలాగే జీరో కమీషన్ విధానం ద్వారా సుమారు రూ. 19 కోట్లు ఆదా చేసుకున్నారు.

Namma Yatri App Auto (Credits: X)

Newdelhi, Oct 21: ఓలా (Ola), ఉబర్‌ (Uber) కు పోటీగా ప్రారంభించిన యాప్‌ ద్వారా ఆటో డ్రైవర్లు ఏడాదిలోపు సుమారు రూ.189 కోట్లు సంపాదించారు. అలాగే జీరో కమీషన్ విధానం ద్వారా సుమారు రూ. 19 కోట్లు ఆదా చేసుకున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. గత ఏడాది నవంబర్‌లో ఓలా, ఉబర్‌ కు పోటీగా ‘నమ్మ యాత్రి యాప్‌’ ను (Namma Yatri app) ఓపెన్ నెట్‌ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ) సంస్థ ప్రారంభించింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఆటో డ్రైవర్లు, కస్టమర్లను నేరుగా ఈ యాప్‌ అనుసంధానం చేస్తుంది.

EC Shocker: 107 మంది తెలంగాణ అభ్యర్థులపై ఈసీ వేటు.. ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం.. గత ఎన్నికల్లో పోటీ చేసి.. ఖర్చు వివరాలు సమర్పించని సదరు అభ్యర్థులు.. 10ఏ కింద అనర్హత చర్యలు తీసుకున్న ఈసీ

చార్జీలు ఇలా..

‘నమ్మ యాత్రి యాప్‌’ ఛార్జీలు ప్రభుత్వం నిర్ణయించిన రేటుపై ఆధారపడి ఉంటాయి. ప్రతి ట్రిప్‌ కు రెండు కిలోమీటర్ల దూరం వరకు కనీస ఛార్జీ రూ.30. ఎక్కువ దూరానికి కిలోమీటరుకు రూ.15 చొప్పున ఛార్జీ ఉంటుంది. అలాగే కనీస బుకింగ్‌ ఛార్జీ రూ. 10 కాగా, ఆటో డ్రైవర్లు రూ.30 వరకు పెంచుకునే అవకాశం కూడా ఉన్నది.

Traffic Restrictions: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, సద్దుల బతుకమ్మ సందర్భంగా ఈ ప్రాంతంలో వాహనాల మళ్లింపు, ప్రత్యామ్నాయ మార్గాలివే!