Femina Miss India 2023 Nandini Gupta: ‘ఫెమీనా మిస్ ఇండియా’గా రాజస్థాన్ భామ నందినీ గుప్తా.. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో అట్టహాసంగా ఫైనల్ వేడుకలు.. అందం, అభినయంతో ఆకట్టుకున్న 19 ఏళ్ల నందినీ గుప్తా

ఈసారి 19 ఏళ్ల రాజస్థాన్ భామ నందినీ గుప్తా మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్నారు.

Credits: Twitter

Newdelhi, April 16: రాజస్థానీ సౌందర్యానికి ఫెమీనా మిస్ ఇండియా (Femina Miss India 2023) కిరీటం మురిసిపోయింది. ఈసారి 19 ఏళ్ల రాజస్థాన్ భామ నందినీ గుప్తా (Nandini Gupta) మిస్ ఇండియా (Miss India) కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ప్రతిష్ఠాత్మక 59వ ఎడిషన్ ఫెమీనా మిస్ ఇండియా ఫైనల్ పోటీలు మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లోని కుమన్ లంపక్ ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా జరిగాయి. మొత్తం 29 రాష్ట్రాలకు చెందిన అందాల భామలు మిస్ ఇండియా కిరీటం కోసం పోటీ పడ్డారు. చివరికి, తన అందం, అభియనంతో ఆకట్టుకున్న రాజస్థాన్‌లోని కోటాకు చెందిన నందినీ గుప్తా విజేతగా నిలిచారు. ఈ కార్యక్రమానికి కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే వంటి సినీ తారలు సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

Vivekananda Reddy Murder Case: వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం.. ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి అరెస్ట్.. పులివెందులలో భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసి కడపకు తరలించిన సీబీఐ

మొదటి రన్నరప్ శ్రేయా పూన్జా

కార్తీక్, అనన్య వేదికపై డ్యాన్స్ చేసి అలరించారు. అన్ని పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నందినీ గుప్తా మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్నారు. గత ఏడాది మిస్ ఇండియాగా నిలిచిన సినీశెట్టి ఆమెకు కిరీటాన్ని తొడిగారు. ఢిల్లీకి చెందిన శ్రేయా పూన్జా, మణిపూర్‌కు చెందిన తౌనోజమ్ స్ట్రెలా లువాంగ్ వరుసగా మొదటి, రెండో రన్నరప్‌గా నిలిచారు.

Atiq Ahmad Murder: పోలీసుల సమక్షంలో మీడియాతో మాట్లాడుతుండగానే అతిక్‌ అహ్మద్‌పై కాల్పులు, స్పాట్‌లోనే చనిపోయిన అతిక్, అష్రఫ్, కాల్పులు జరిపిన ముగ్గురు అరెస్ట్, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన అతిక్ మర్డర్ వీడియో (Watch Video)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif