New Year Events in Hyderabad: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకల కోసం టాప్ 10 ఈవెంట్లు ఇవిగో, ధర కూడా రూ.299 నుంచి ప్రారంభం
2025కి ప్రజలంతా స్వాగతం పలకనున్నారు. దీంతో డిసెంబర్ 31 రాత్రి దేశ వ్యాప్తంగా సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నాయి. ఈ సెలబ్రేషన్స్ కోసం ఈవెంట్లు సైతం రెడీ అయ్యాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈవెంట్లు (New Year 2025 Celebration in HYD) జరగనున్నాయి.
నేటితో 2024 ఏడాదికి వీడ్కోలు చెప్పి.. 2025కి ప్రజలంతా స్వాగతం పలకనున్నారు. దీంతో డిసెంబర్ 31 రాత్రి దేశ వ్యాప్తంగా సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నాయి. ఈ సెలబ్రేషన్స్ కోసం ఈవెంట్లు సైతం రెడీ అయ్యాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈవెంట్లు (New Year 2025 Celebration in HYD) జరగనున్నాయి. ఇక భాగ్యనగరం హైదరాబాద్ కూడా అద్భుతమైన న్యూ ఇయర్ వేడుకలు 2025 కోసం సిద్ధమైంది.
డిసెంబర్ 31, 2024 రాత్రి అందరూ సెలబ్రేట్ చేసుకునేందుకు ఈవెంట్లు (New Year's Eve Party) రెడీగా ఉన్నాయి. లైవ్ మ్యూజిక్ నుంచి విలాసవంతమైన జీవితం వరకు అంతా రెడీ అయింది. ధరను బట్టి మీరు ఈ ఈవెంట్ ప్రదేశాన్ని సెలక్ట్ చేసుకోవచ్చు. ఈవెంట్ టికెట్ బుక్ మై షోలో కొనుక్కోవచ్చు.ఈ నేపథ్యంలో హైదరబాద్ నగరంలో ఈవెంట్ స్పాట్‌లు ఈ చోట ఉన్నాయి.. బుక్ మై షోలో వాటి ధర ఎంత ఉంది అనే విషయాలు తెలుసుకుందాం.
దిగువ జాబితాలో హైదరాబాద్‌లో నూతన సంవత్సర వేడుకలు మరియు కార్యకలాపాలు ఉన్నాయి. అద్భుతమైన సంగీతం మరియు అద్భుతమైన వైబ్‌తో నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి ఈ ప్రదేశాలు రెడీగా ఉన్నాయి.
New Year Parties in Hyderabad | Place | Time | Ticket Price |
---|---|---|---|
NYE 2025 | Novotel HICC | 8:00 PM | Rs. 1,499 onwards |
Amaal Malik Live | HITEX Exhibition CeNter: Hyderabad | 7:00 PM | Rs. 999 onwards |
NYE Carnival with Karthik & Sunitha Upadras | Boulder Hills | 7:00 PM | Rs. 1,699 onwards |
Biggest open air new year Eve 2025 @ thrive | Uppal Municipal Stadium | 7:00 PM | Rs. 149 onwards |
NYE 2024 - The Prism Circus 4.0 | Prism Club and Kitchen | 8:00 PM | Rs. 2,499 onwards |
New year Eve 2025 - hyd luxe fort view event | Chiraan Fort | 8:01 PM | Rs. 299 onwards |
New Year Party with DJ Chetas | Ramoji Film City | 8:00 PM | Rs. 2,000 onwards |
Ultimate NYE Bash | GBR Cultural Kompally | 8:00 PM | Rs. 199 onwards |
Night In Paris 2.0 NYE | Taj Deccan | 8:00 PM | Rs. 2,500 onwards |
1. NYE 2025
ఈ సంవత్సరం హైదరాబాద్‌లో జరిగే అతి పెద్ద నూతన సంవత్సర వేడుకలు మీకు ఇష్టమైన వారి మధ్య ఉత్తమ ఆనందాన్ని పంచాలని మీరు కోరుకుంటే మీరు కూడా భాగమయ్యే గొప్ప చలనచిత్ర వేడుక! ఆల్వేస్ ఈవెంట్స్‌లో మీకు ఇష్టమైన లైవ్ ఆర్టిస్ట్, డ్యాన్సింగ్ క్వీన్ శ్రీ లీల ప్రత్యేక అతిథి పాత్రతో కనువిందు చేయనుంది.
2. అమల్ మాలిక్ లైవ్
ప్రశంసలు పొందిన అమల్ మల్లిక్ మరియు అతని లైవ్ బ్యాండ్ అద్భుతమైన లైవ్ పెర్ఫార్మెన్స్‌తో ఈవెంట్ జరగనుంది.