Railway Clarification: రైళ్ళలో ఐదేండ్ల లోపు చిన్నారులకు కూడా టికెట్ తీసుకోవాలి అంటూ వార్తలు.. రైల్వే శాఖ ఏం చెప్పిందంటే?

రైల్వే శాఖ స్పష్టీకరణ

Ticket (Image Credits: Twitter)

New Delhi, August 18: ఒకటి నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు సైతం పెద్దలకు అయ్యే చార్జీనే వసూలు చేస్తారంటూ మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో రైల్వే శాఖ (Railways) వివరణ ఇచ్చింది. నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని, మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఐదేళ్లలోపు పిల్లలు రైళ్లలో ఉచితంగా (Free) ప్రయాణించవచ్చని ఈమేరకు 2020 మార్చి 6న జారీచేసిన ఉత్తర్వులను గుర్తుచేసింది.

ప్రపంచ కప్ ను దాటి పోనివ్వొద్దు.. భారత ఫుట్‌బాల్‌ సమాఖ్యపై నిషేధం‌ అంశంలో.. కేంద్రానికి సుప్రీం కీలక ఆదేశాలు

ఆ సర్క్యులర్ ప్రకారం.. ఐదేళ్ళలోపు పిల్లలకు  ప్రత్యేకంగా బెర్త్‌ (Berth)గానీ, సీటు (Seat) గానీ కేటాయించరు. ఒకవేళ బెర్త్‌ లేదా సీటు కావాలనుకుంటే పెద్దలకు అయ్యే రుసుమును చెల్లించి, టికెట్‌ కొనాల్సి ఉంటుంది. వద్దు అనుకుంటే ఉచితంగా ప్రయాణించవచ్చు.