ISI Mark for Stainless Steel, Aluminium Utensils: స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌, అల్యూమినియం వంట పాత్రలకు ఐఎస్‌ఐ గుర్తు తప్పనిసరి.. కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు

వినియోగదారుల భద్రత, ఉత్పత్తుల నాణ్యతను పెంపొందించే చర్యల్లో భాగంగా జాతీయ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఈ ఆదేశాలు జారీ చేసింది.

Stainless Steel (Credits: X)

Newdelhi, July 6: వంటింట్లో వాడే స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌ (Stainless Steel), అల్యూమినియం (Aluminium) వంట పాత్రలకు కేంద్ర ప్రభుత్వం ఐఎస్‌ఐ గుర్తును తప్పనిసరి చేసింది. వినియోగదారుల భద్రత, ఉత్పత్తుల నాణ్యతను పెంపొందించే చర్యల్లో భాగంగా జాతీయ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ఐఎస్‌ఐ మార్క్‌ లేని స్టీల్‌, అల్యూమినియం వంట పాత్రల తయారీ, ఎగుమతి, అమ్మకాలపై నిషేధం ఉందని భారత ప్రమాణాల సంస్థ(బీఐఎస్‌) తెలిపింది. ఈ ఆదేశాలను ధిక్కరించిన వారిపై జరిమానాలు విధిస్తామని చెప్పింది.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నేడే.. ప్రజాభవన్ వేదికగా సమావేశంకానున్న చంద్రబాబు, రేవంత్‌ రెడ్డి.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇరురాష్ట్రాల ప్రజలు.. ఏయే అంశాలపై చర్చ ఉండొచ్చంటే?

ప్రమాణాలు ఇవే

వంట పాత్రల తయారీకి సంబంధించి బీఐఎస్‌ తాజాగా కొన్ని ప్రమాణాలు రూపొందించింది. పాత్రల తయారీలో నాణ్యమైన, సురక్షితమైన ముడి సరుకు వాడటం, రూల్స్ ప్రకారమే పాత్రల రూపు, డిజైన్, బరువు ఉండటం వంటి అంశాలపై ఈ ప్రమాణాలను నిర్దేశించింది.

తమిళనాడులో దారుణం, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌ను నరికి చంపిన ప్రత్యర్థులు



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif