Lottery: మార్చిన టికెట్ అదృష్టంలా అలా వరించింది... కేరళ ఆటోడ్రైవర్ కు రూ.25 కోట్ల లాటరీ

ఆటోడ్రైవర్ గా పనిచేస్తున్న అనూప్.. చెఫ్ గా పనిచేసేందుకు మలేసియా వెళ్లాలని నిర్ణయం.. తొలుత ఓ లాటరీ కొనుగోలు చేసిన అనూప్.. అది నచ్చక మరో టికెట్ ను ఎంచుకున్న వైనం.. ఇప్పుడా టికెట్ కే లాటరీ

Anup (Photo Credit: Twitter)

Thiruvananthapuram, September 19: కేరళలో (Kerala) ఓ ఆటోడ్రైవర్ (Auto Driver) ను అనూహ్యరీతిలో అదృష్టం (Luck) పలకరించింది. తొలుత ఓ లాటరీ టికెట్ ఎంచుకున్న అతగాడు, అది నచ్చక మరో టికెట్ తీసుకున్నాడు. ఇప్పుడా రెండో టికెట్ (Ticket) కు ఏకంగా రూ.25 కోట్ల జాక్ పాట్ తగిలింది. అవును.. వివరాల్లోకి వెళ్తే..  తిరువనంతపురం శ్రీవరాహం ప్రాంతంలో నివసించే అనూప్ ఓ ఆటోడ్రైవర్. అతడికి వంటల్లోనూ ప్రావీణ్యం ఉంది. అందుకే చెఫ్ గా పనిచేసేందుకు మలేసియా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం బ్యాంకులో రూ.3 లక్షల లోన్ (Loan) కోసం అప్లై చేసుకున్నాడు. ఇక, అనూప్ కు లాటరీల పిచ్చి ఉంది. ఎప్పటికైనా దశ తిరగకపోతుందా అని గత 22 ఏళ్లుగా లాటరీలు కొంటున్నాడు.

కశ్మీర్‌లో మూడు దశాబ్దాల తర్వాత తెరుచుకున్న సినిమా థియేటర్లు.. ప్రారంభించిన లెఫ్టినెంట్ గవర్నర్

మలేసియా వెళుతున్నాం కదా, చివరిసారిగా ఓ టికెట్ కొందాం అని ఓ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. ఎందుకనో ఆ టికెట్ నచ్చక, మరో టికెట్ తీసుకున్నాడు. ఇప్పుడా టికెట్టే అనూప్ జీవితాన్ని మార్చివేసింది. అతడిని కోటీశ్వరుడ్ని చేసింది. ట్యాక్స్ లు అన్నీ పోను ఆ ఆటోడ్రైవర్ కు రూ.15 కోట్ల వరకు వస్తాయట. వచ్చిన డబ్బుతో మంచి ఇల్లు కట్టుకుంటానని, అప్పులన్నీ తీర్చేస్తానని అనూప్ చెబుతున్నాడు. బంధువులకు సాయం చేయడంతో పాటు, సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేపడతానని వెల్లడించాడు. అంతేకాదు, ఇక మలేసియా వెళ్లనని, కేరళలోనే ఉంటానని తెలిపాడు.



సంబంధిత వార్తలు

APSRTC Driver Dance Video: బస్సుముందు డ్యాన్స్ వేసిన ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్ మళ్లీ విధుల్లోకి, ఆయన డ్యాన్స్‌ను మెచ్చుకున్న నారా లోకేష్, దిగి వచ్చిన అధికారులు

Hyderabad Horror: గచ్చిబౌలిలో అర్థరాత్రి రెచ్చిపోయిన కామాంధులు, డ్యూటీ నుంచి ఇంటికి వెళుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని ఆటోలోకి లాక్కెళ్లి ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం

Bengaluru Auto Driver Slaps Female Passenger: ఓలా రైడ్ క్యాన్సిల్ చేసినందుకు మ‌హిళ‌ను చెంపై కొట్టిన ఆటో డ్రైవ‌ర్, గ్యాస్ డ‌బ్బులు మీ నాన్న ఇస్తాడా? అంటూ ఆగ్ర‌హం (వీడియో ఇదుగోండి)

Karimnagar: ఓవ‌ర్ లోడ్ అయిన బస్సు, నేను న‌డ‌ప‌లేను బాబోయ్ అంటూ న‌డిరోడ్డుపైనే నిలిపివేసిన ఆర్టీసీ బ‌స్సు డ్రైవ‌ర్, 55 మంది ఎక్కాల్సింది ఏకంగా 110 మంది ఎక్కారంటూ ఆవేద‌న‌