Hyderabad, Feb 8: హైదరాబాద్ (Hyderabad Horror) లో దారుణం జరిగింది. ఏడేళ్ల చిన్నారిపై బస్సు డ్రైవర్ (Bus Driver) లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో బాధిత బాలిక చదువుకొంటున్నది. స్కూల్ యాజమాన్యం విద్యార్థులను ఈ నెల 4న మంచాల మండలం వద్ద ఒక రిసార్టుకు విహారయాత్రకు తీసుకెళ్ళారు. అయితే ఒకటో తరగతి చదువుతున్న బాధిత బాలికపై బస్సు డ్రైవర్ జోసఫ్ రెడ్డి (40) లైంగిక దాడికి పాల్పడ్డాడు. బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించాడు.
దారుణం.. ఏడేళ్ల చిన్నారిపై బస్సు డ్రైవర్ లైంగిక దాడి
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులను ఈ నెల 4న మంచాల మండలం వద్ద ఒక రిసార్టుకు విహారయాత్రకు తీసుకెళ్ళారు
అయితే అక్కడ ఒకటో తరగతి చదువుతున్న బాలికపై బస్సు డ్రైవర్ జోసఫ్… pic.twitter.com/JnajKMSbtb
— Telugu Scribe (@TeluguScribe) February 8, 2025
అలా బయటకు..
ఘోరం జరిగినప్పటినుండి అస్వస్థతకు గురైన బాలికకు తీవ్ర రక్తస్రావం కూడా అయ్యేది. దీన్ని గమనించిన తల్లి.. బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లింది. బలమైన ఒత్తిడి కారణంగా ఇలా అవుతుంది అని డాక్టర్ వెల్లడించగా.. ఏం జరిగిందని చిన్నారిని తల్లితండ్రులు ఆరా తీశారు.విహారయాత్రకు వెళ్ళినప్పుడు బస్సు డ్రైవర్ తనను టాయిలెట్ లోకి తీసుకెళ్ళి లైంగిక దాడి చేసినట్టు చిన్నారి బోరుమంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపాల్ ను నిలదీయగా.. నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో మంచాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.